Virat Kohli: ఈ పదేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా.. కోహ్లీ పోస్ట్ వైరల్! గందరగోళంలో ఫాన్స్
- ముమ్మర ప్రాక్టీస్ చేస్తోన్న కోహ్లీ
- గందరగోళంలో టీమిండియా ఫాన్స్
- విరాట్ ఏం రాసుకొచ్చాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా, భారత్ టీమ్స్ మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ ట్రోఫీ కోసం కాస్త ముందుగానే ఆసీస్ చేరుకున్న టీమిండియా.. ముమ్మర ప్రాక్టీస్ చేస్తోంది. ప్రస్తుతం ఆసీస్ గడ్డపై ఉన్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ పోస్టుతో అభిమానులు కొందరు గందరగోళంకు గురయ్యారు. ఈ పోస్ట్ దుస్తుల బ్రాండ్ ‘రాన్’ గురించే అయినా.. తొలి లైన్లలో వాడిన పదాలు చూసి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ విరాట్ ఏం రాసుకొచ్చాడంటే?..
‘వెనక్కి తిరిగి చూసుకుంటే.. మేం ఎప్పుడూ కాస్త భిన్నంగానే ఉంటాము. మేం ఒక అభిరుచికే పరిమితం కాలేదు. ఆరంభంలోనే మేమేంటో అందరికీ తెలిసినా రెండుసార్లు గాడి తప్పాము. మేము సంవత్సరాలుగా ఎంతగానో మారాం. కానీ ఎల్లప్పుడూ మా ప్రత్యేకత అలాగే ఉంది. కొందరు మమ్మల్ని వెర్రివాళ్లనుకున్నారు. కొంతమందికి మేం అర్ధం కాలేదు. మేం అవేమీ పట్టించుకోలేదు. మేమేంటో నిరుపించుకునే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉన్నాం. ఈ 10 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాము. కరోనా కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. అందరికంటే భిన్నంగా ఉండటమే మమ్మల్ని ప్రత్యేకంగా మార్చింది. అదే రాన్. మరో పదేళ్లు కూడా ఇలాగే కొనసాగుతాం. రాన్ ఓ సరైన వ్యక్తి కోసం’ అని కోహ్లీ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. రాన్ పదేళ్ల ప్రయాణం సందర్భంగా విరాట్ ఈ పోస్ట్ పెట్టాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
Also Read: Redmi Note 14 Launch: రెడ్‌మీ నోట్ 14 సిరీస్ వచ్చేస్తోంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
విరాట్ కోహ్లీ ఈ పోస్టుకు వాడిన వైట్ బ్యాగ్రౌండ్ టెంప్లేట్‌ను 2022లో టెస్ట్ కెప్టెన్సీ వదిలేసినప్పుడు వాడాడు. ఇప్పుడు కూడా అదే టెంప్లేట్‌ను వాడడంతో.. విరాట్ ఏదో షాక్ ఇస్తున్నాడని అభిమానులు అనుకున్నారు. పూర్తి నోట్ చదివిన ఫాన్స్ హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న కోహ్లీ.. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌పై దారుణంగా విఫలమయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ ఫామ్ అందుకుంటాడని ఫాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
— Virat Kohli (@imVkohli) November 20, 2024
తాజావార్తలు
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!