కంది పంటను వాణిజ్య పంటగా పండిస్తారు.. మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా పండిస్తున్నారు.. తెలంగాణాలో సుమారుగా 2.86 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో 2 లక్షల 80 వేల ఎకరాల్లో కందిని సాగవుతుంది.. పంటను ఒకటి మాత్రమే కాదు.. కొన్ని పంటలల్లో అంతర పంటగా వేసుకోవచ్చు.. ఎకరాకు 8 నుండి 10క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉంది.. ఒక్క కందిని మాత్రమే వేసుకొనే వాళ్లు ఎకరాకు 6 నుంచి 7 కిలోల విత్తనం అవసరం అవుతుంది..
అంతర పంటగా వేస్తే 2 నుండి 3 కిలోల విత్తనం సరిపోతుంది. కంది సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. మరి సాగులో అధిక దిగుబడులు పొందాలంటే సమగ్ర యాజమాన్యం అనేది తప్పకుండా పాటించాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు..అపరాలల్లో కంది ప్రధాన పంట. మన రాష్ట్రంలో కంది వర్షాధార పంటగా అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈసంవత్సరం వర్షాలు ఆలస్యంగా రావడంతో రైతులు కందిని ఆలస్యంగా విత్తుకున్నారు. కానీ అంతలోనే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కంది పంటకు చాలా నష్టం వాటిల్లింది.. మళ్లీ విత్తిన పంటకు తెగుళ్లు ఆశించాయి..
ఈ తెగుళ్లకు సంబందించి శిలీంద్రం భూమి ద్వారా వ్యాపిస్తుంది. కావున రైతులు కచ్చితంగా పంట మార్పిడి పద్ధతిని చేపట్టాలి అలాగే పంట వేసుకోవడానికి ముందుగానే ట్రైకోడెర్మా అని జీవసంబంధ రసాయన శిలీంద్రాని చివికిన పశువుల పేడకు కలిపి 15 రోజుల తర్వాత పొలం మొత్తం వెదజల్లాలి. మోటాలాక్సిల్ ఏ2 గ్రాములు ఒక కేజీ విత్తనానికి రెండు పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి.. అప్పుడే తెగుళ్ల నుంచి ఉపశమనం కలుగుతుంది.. సాదారణ పద్దతిలో గొర్రుతో పంట వేసుకోవడం మంచిది.. ఇకపోతే నాలుగు అడుగుల ఎడంతో బెడ్ ను తయారు చేసుకోవాలి. అలాగే మడును మధ్యలో వర్షపు నీరు పోయేందుకు వీలుగా కాలువల్ని వదులుకోవాలి. అధిక వర్షాలకు తెగులు ఆశించినప్పుడు మొటాలాక్సిల్ లేదా మ్యాంగోజప్ అనే మందులు రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి.. అప్పుడే తెగుళ్ల బెడద తగ్గుతుంది.. తద్వారా అధిక దిగుబడిని పొందవచ్చు..