మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పంటలలో అరటి కూడా ఒకటి.. అరటిలో మూడు రకాలు ఉన్నాయి.. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో పచ్చని అరటిపండ్లను ఎక్కువగా పండిస్తున్నారు.. అయితే ఎర్రని అరటి పండ్లను కూడా మన నెలల్లో పండించవచ్చునని అంటున్నారు..ఆ పండ్ల సాగుకు అనువైన నెలలు… సాగు విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇవి రుచిగా ఉండటంతో వీటి కొనుగోలుకు కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. రెడ్ బనానా సీడ్ ప్రస్తుతం స్థానిక నర్సరీలతో పాటు కోయంబత్తూర్, బెంగళూరులో అందుబాటులో ఉందని నిపుణులు చెబుతున్నారు.. ప్రముఖ నగరాల్లో పిలకలు అందుబాటులో ఉన్నాయి.. ఈ రకం అరటిని నీటి వనరులున్న రైతులు.. కాలంతో సంబంధం లేకుండా సాగు చేయవచ్చు. నాటుకున్న రకాన్ని బట్టి ఏడాది వ్యవధిలో దిగుబడి వస్తుంది. ఈ ఎర్ర అరటి మొక్కలు ఎత్తుగా, ధృఢంగా, వెడల్పుగా పెరుగుతాయి. కాబట్టి మొక్కలు, వరుసల మధ్య రెండు మీటర్ల దూరం పాటించి ఎకరా విస్తీర్ణం లో 800 | మొక్కల వరకు నాటుకోవాలి. మొక్కల ఖర్చు కాకుండా.. ఈ పంటకు ఎకరాకు దాదాపు 50-60వేలకు పైనే పెట్టుబడి అవసరం అవుతుంది. ఇందులో కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది..
ఇకపోతే గెలల బరువు కు చెట్లు వంగి పోకుండా కర్రలను కూడా పెట్టాలి.. వీటికి అదనంగా ఖర్చు చేయాలి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మార్కెటింగ్ విషయం లో కాస్త ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తే దాదాపు ఒక్కో గెల రూ.350-400 వరకు ధర వస్తుంది. సాధారణ అరటి తో పోలిస్తే ఈ రకం, ఈదురు గాలులు, వర్షాలను తట్టుకుని మంచి దిగుబడిని ఇస్తాయి.. రైతులు వీటి సాగు చేసి సులభంగా లాభాలు పొందవచ్చు.. ఇక కిలోల ప్రకారం అమ్మితే 60 రూపాయల వరకు వస్తుంది.. ఈ పండ్ల కు మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది.. సో పంట వల్ల లాభలే కానీ నష్టాలు లేవు..