రియల్‌మీ త్వరలో మరో కొత్త టాబ్లెట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్యాడ్ 2 లాంచ్ అయిన రెండు సంవత్సరాల తర్వాత, కంపెనీ త్వరలో భారత్ లో రియల్‌మీ ప్యాడ్ 3ని విడుదల చేయొచ్చని సమాచారం. జనవరి 6న రియల్‌మీ 16 ప్రో సిరీస్ 5Gతో పాటు కంపెనీ ఈ కొత్త టాబ్లెట్‌ను విడుదల చేయొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. లాంచ్ కు ముందే, రాబోయే టాబ్లెట్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. రియల్‌మీ ప్యాడ్ 3 2.8K LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది 45W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని టాక్.
Also Read:God Of War : ఎన్టీఆర్ తో కాదని అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రియల్‌మీ XTలో టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ చేసిన పోస్ట్ ప్రకారం, రియల్‌మీ ప్యాడ్ 3లో 11.6-అంగుళాల LCD స్క్రీన్ 2.8K రిజల్యూషన్‌తో ఉండవచ్చని, ఇది 500 నిట్‌ల వరకు బ్రైట్ నెస్ ను అందిస్తుందని సూచిస్తుంది. ఈ టాబ్లెట్‌లో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉండవచ్చని భావిస్తున్నారు. రియల్‌మీ ప్యాడ్ 3 కోసం కీబోర్డ్, స్టైలస్‌తో సహా కొన్ని ఉపకరణాలను కూడా అందించొచ్చని సమాచారం.
Also Read:Kiara Advani : పర్ఫెక్ట్ బాడీ కంటే మాతృత్వమే గొప్పది..
రియల్‌మి ప్యాడ్ 3 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 12,200mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ టాబ్లెట్ భారతదేశంలో Wi-Fi, 5G వేరియంట్‌లలో వస్తుందని భావిస్తున్నారు. ఇది రెండు కలర్ ఆప్షన్స్ లో అందించబడుతుందని భావిస్తున్నారు.. షాంపైన్ గోల్డ్, స్పేస్ గ్రే. అన్ని వేరియంట్‌లలో 8GB RAM, 128GB, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటాయని సమాచారం.