Kiara Advani : పర్ఫెక్ట్ బాడీ కంటే మాతృత్వమే గొప్పది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ లు కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితం కూడా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం.. తర్వాత పిలల్లు.. మళ్లీ యధావిధిగా సినిమాలు. ప్రతి ఒక్కరూ ఇదే ఫాలో అవుతున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఒకరు. ఈ ఏడాది జూలైలో పాప ‘సరాయా’కు జన్మనిచ్చిన ఆమె.. తాజాగా మాతృత్వం తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చేసిందో వివరించింది. ముఖ్యంగా హృతిక్ రోషన్ సరసన నటించిన ‘వార్ 2’ సినిమాలో కియారా బికినీ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సీన్ చూసినప్పుడు తనకు కలిగిన ఫీలింగ్‌ను కియారా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.
Also Read : Champion : ఓటీటీ డీల్ ముగించుకున్న ఛాంపియన్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
Also Read
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
‘ ‘వార్ 2’లోని ‘ఆవన్ జావన్’ పాటలో బికినీలో కనిపించడం కోసం ఎంతో కష్టపడి నా శరీరాన్ని ఫిట్‌గా మార్చుకున్నాను. కానీ సినిమా విడుదల సమయానికి డెలివరీ కావడంతో శరీరం పూర్తిగా మారిపోయింది. ఆ బికినీ షాట్ కోసం చాలా క్రమశిక్షణతో కష్టపడ్డాను. కానీ డెలివరీ అయ్యాక నా శరీరాన్ని చూసుకుంటే చాలా కొత్తగా అనిపించింది. మొదట మళ్ళీ పాత షేప్‌లోకి రావాలని అనుకున్నాను కానీ, వెంటనే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. పర్ఫెక్ట్ బాడీ కంటే ఒక ప్రాణాన్ని భూమిపైకి తెచ్చిన నా శరీరం ఎంత గొప్పదో అర్థమైంది. ఇప్పుడు నేను ఏ సైజులో ఉన్నా, ఎలా ఉన్నా నా శరీరాన్ని నేను గౌరవిస్తాను’ అంటూ ఎమోషనల్ అయ్యింది.
ప్రస్తుతం తన కూతురు సరాయాతో గడుపుతున్న ప్రతి నిమిషం తనకు ఎంతో ప్రత్యేకం అని కియారా చెప్పుకొచ్చింది. పాప చేసే చిలిపి పనులు, నవ్వులు చూస్తుంటే తన అలసట అంతా మాయం అయిపోతుందని అంటోంది. ఈ ఏడాది ‘గేమ్ ఛేంజర్’, ‘వార్ 2’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన కియారా, త్వరలో కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో కనిపించబోతోంది. మాతృత్వం తనలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆమె ఈ సందర్భంగా తెలిపింది.
తాజావార్తలు
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
-
OTR: తెలంగాణ కేబినెట్లో విజయశాంతికి ఛాన్స్? ఢిల్లీలో గట్టిగా లాబీయింగ్!
-
Srimad Bhagavatam : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టెక్నీషియన్లతో 7 భాగాలుగా ‘శ్రీమద్భాగవతం
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!