Huawei Nova 11 SE 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘హువావే’ ఎప్పటికప్పుడు భారత మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తుంటుంది. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా బడ్జెట్ ధరలో ఫోన్‌లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో మరో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను హువావే రిలీజ్ చేస్తోంది. అదే ‘హువావే నోవా 11 ఎస్‌ఈ’ స్మార్ట్‌ఫోన్. చైనా మార్కెట్‌లో ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్.. త్వరలోనే భారత మార్కెట్‌లోకి రానుంది.
Huawei Nova 11 SE Price:
హువావే 11 సిరీస్ ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనాలో ప్రారంభించబడింది. ఈ లైనప్‌లో మూడు ఫోన్‌లు (హువావే నోవా 11, హువావే నోవా 11 ప్రో మరియు హువావే నోవా 11 అల్ట్రా) ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ హువావే నోవా 11 ఎస్‌ఈ లాంచ్‌తో సిరీస్‌లో మరో మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రీ ఆర్డర్‌లు ఇప్పటికే చైనాలో ఆరంభమయ్యాయి. ఈ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ. 23,000 కాగా.. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25,000గా ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగులలో (నలుపు, ఆకుపచ్చ మరియు తెలుపు) అందుబాటులో ఉంది.
Huawei Nova 11 SE Specs:
హువావే నోవా 11 ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 680 ఎల్‌టీఈ ఎస్వోసీ ప్రాసెసర్‌ను అందించారు. ఎల్‌టీఈ ఎస్వోసీ విత్ 2.4 గిగా హెర్ట్జ్ సీపీయూతో ఇది పనిచేయనుంది. హార్మోనీ ఆపరేటింగ్ సిస్టమ్ 4 వెర్షన్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 ఇంచెస్ ఫ్లాట్ ఓఎల్‌ఈడీ ప్యానెల్ డిస్‌ప్లే ఉంటుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను ఇందులో అమర్చారు.
Also Read: Afghanistan Semi Final Chances: సెమీస్ రేసు రసవత్తరం.. అఫ్గానిస్థాన్‌కు ఇంకా ఛాన్స్ ఉందా?
Huawei Nova 11 SE Camera and Battery:
హువావే నోవా 11 ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. వెనకాల 108 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరాలను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన కెమెరా ఉంటుంది. హువావే నోవా 11 ఎస్‌ఈలో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. ఇది 66 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.