Realme GT 7, Realme GT 7T, Realme GT 7 డ్రీమ్ ఎడిషన్ స్మార్ట్ఫోన్లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. GT సిరీస్‌లోని ఈ మూడు స్మార్ట్ఫోన్లలో MediaTek డైమెన్సిటీ చిప్సెట్, 7000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసేలా రూపొందించింది కంపెనీ. Realme GT 7 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. Realme GT 7T లో డ్యూయల్ రియర్ కెమెరాను అందించింది. ఆస్టన్ మార్టిన్ యొక్క F1 టీమ్‌తో కలిసి కంపెనీ రియల్మే GT 7 డ్రీమ్ ఎడిషన్‌ను ప్రత్యేక ఎడిషన్‌గా విడుదల చేసింది.
Also Read:Kidney Stone Risk: ఎండాకాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎందుకు పెరుగుతుంది? నివారణ చర్యలు..!
Realme GT 7, Realme GT 7T ధర
Realme GT 7 స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ 8 GB RAM, 256 GB స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ.39,999. రెండవ వేరియంట్ 12 GB RAM, 256 GB తో వస్తుంది. దీని ధర రూ. 42,999. మూడవ వేరియంట్ 12 GB RAM, 512 GB స్టోరేజ్ తో వస్తుంది. దీనిని కంపెనీ రూ.46,999 కు ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ రెండు కలర్స్ ఐస్‌సెన్స్ బ్లాక్, ఐస్‌సెన్స్ బ్లూ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
Also Read:Mangaluru: కర్ణాటకలో ఉద్రిక్తత.. సుహాస్ శెట్టి తర్వాత మసీద్ సెక్రటరీ దారుణహత్య..
Realme GT 7T కూడా మూడు వేరియంట్లలో విడుదలైంది. బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో రూ.34,999 కు ప్రవేశపెట్టారు. రెండవ వేరియంట్ 12 GB RAM, 512 GB స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ. 37,999. మూడవ వేరియంట్ 12 GB RAM, 512 GB స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ. 41,999. ఈ ఫోన్ మూడు రంగులలో ఐస్‌సెన్స్ బ్లాక్, ఐస్‌సెన్స్ బ్లూ, రేసింగ్ ఎల్లోలో లభిస్తుంది.
Also Read:Mangaluru: కర్ణాటకలో ఉద్రిక్తత.. సుహాస్ శెట్టి తర్వాత మసీద్ సెక్రటరీ దారుణహత్య..
బ్యాంక్ ఆఫర్లతో, Realme GT 7, Realme GT 7T స్మార్ట్ఫోన్లను వరుసగా రూ. 34,999, రూ. 28,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫస్ట్ సేల్ మే 30న అమెజాన్ ఇండియా, రియల్‌మి అధికారిక వెబ్సైట్లో ప్రారంభమవుతుంది.
రియల్మీ జిటి 7 డ్రీమ్ ఎడిషన్‌ను కంపెనీ 16 జిబి ర్యామ్, 512 జిబి స్టోరేజ్‌తో రూ.49,999 కు విడుదల చేసింది. ఈ ఫోన్ ఆస్టన్ మార్టిన్ రేసింగ్ గ్రీన్ షేడ్‌లో వస్తుంది. దీని అమ్మకం జూన్ 13 నుంచి ప్రారంభమవుతుంది.
Realme GT 7 స్పెసిఫికేషన్లు
డ్యూయల్ సిమ్ (నానో + eSIM) కలిగిన Realme GT 7 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6.0 తో వస్తుంది. ఈ Realme ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 1.5K (1,264×2,780 పిక్సెల్‌లు). ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో వస్తుంది. ఈ Realme ఫోన్లో MediaTek Dimensity 9400e చిప్సెట్ ఉంది. ఇది 120fps స్థిరమైన ఫ్రేమ్ రేట్‌తో PUBG, BGMI లకు మద్దతు ఇస్తుంది. Realme GT 7 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు.
Also Read:Pawan Kalyan : పవన్ ఆదేశాలు.. థియేటర్లలో సోదాలు..
ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్స్, ఇది సోనీ IMX906 సెన్సార్. ఈ ఫోన్లో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. Realme GT 7 బ్లూటూత్ 5.4, GPS, NFC, Wi-Fi 7 లకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ AI గ్లేర్ రిమూవల్, AI ల్యాండ్‌స్కేప్+, AI ట్రాన్స్‌లేటర్ వంటి అనేక AI ఆధారిత ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. రియల్మీ ఫోన్లో 7000mAh బ్యాటరీ ఉంది. ఇది 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Realme GT 7T స్పెసిఫికేషన్లు
Realme GT 7T స్మార్ట్‌ఫోన్ సిమ్, సాఫ్ట్వేర్, సెల్ఫీ కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ వేగం GT 7 స్మార్ట్‌ఫోన్‌ను పోలి ఉంటాయి. Realme GT 7T స్మార్ట్‌ఫోన్ 6.80-అంగుళాల (1,280X2,800 పిక్సెల్స్) AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ Realme ఫోన్లో MediaTek Dimensity 8400-Max చిప్సెట్, 12GB వరకు RAM, 512GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, Realme GT 7T స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఈ ఫోన్ ప్రాథమిక కెమెరా 50-మెగాపిక్సెల్ సోనీ IMX896 1.56-అంగుళాల ఇమేజ్ సెన్సార్. ఈ ఫోన్లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇందులో బ్లూటూత్ 6, డ్యూయల్ బ్యాండ్ GPS, NFC, Wi-Fi 6 ఉన్నాయి. Realme GT 7T 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీతో వస్తుంది.
Also Read:TTD: తిరుమల మెట్ల మార్గంలో మళ్లీ చిరుతల అలజడి.. నిపుణులతో టీటీడీ ఈవో భేటీ
Realme GT 7 డ్రీమ్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు
రియల్మీ GT 7, రియల్మీ GT 7T లతో పాటు, రియల్మీ GT 7 డ్రీమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేసింది. ఆస్టన్ మార్టిన్ అరాంకో ఫార్ములా వన్ టీమ్‌తో కలిసి కంపెనీ దీనిని తయారు చేసింది. ఇది ఆస్టన్ మార్టిన్ సిగ్నేచర్ గ్రీన్ కలర్లో వస్తుంది. జీటీ7లోని ఫీచర్లే ఇందులో అందించారు.