Gautam Gambhir: మీ హద్దుల్లో మీరు ఉంటే మంచిది.. టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత్ వైట్‌వాష్‌కు గురైన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) సహ-యజమాని పార్థ్ జిందాల్, టెస్టు క్రికెట్‌కు వేరే స్పెషలిస్ట్ కోచ్ ఉండాలన్న డిమాండ్‌పై గంభీర్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై భారత్ వన్డే సిరీస్ విజయం సాధించిన అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో కోచ్ గంభీర్.. జిందాల్ పేరు ప్రస్తావించకుండానే “తమ హద్దుల్లో ఉండండి” అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
Also Read
మేము సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో ఓడిపోయినప్పుడు రకరకాల విషయాలు మాట్లాడారు. వాటిలో సగం క్రికెట్‌కు సంబంధించినవి కూడా కావని గంభీర్ విలేకరులతో అన్నారు. ఒక ఐపీఎల్ యజమాని కూడా స్ప్లిట్ కోచింగ్ గురించి రాశారు. మేము ఎవరి జోలీకి వెళ్లం, కాబట్టి ఎవరి పరిధిలో వారు ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మేము ఒకరి జోలీకి వెళ్లనప్పుడు, వారు కూడా మా జోలీకి రావడానికి హక్కు లేదని గంభీర్ వ్యాఖ్యానించాడు.
ఇక కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండున్నర రోజుల్లో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్ పిచ్ గురించి చాలా చర్చ జరిగిందని గంభీర్ గుర్తు చేశారు. అయితే ఆ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా రెండు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు దిగలేకపోవడం గురించి ఎవరూ మాట్లాడలేదని గంభీర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిల్ ఆ తర్వాత వన్డేలకు కూడా దూరమయ్యాడు. ఫలితాలు అనుకున్న విధంగా రానప్పుడు చాలా చర్చ జరుగుతుంది. కానీ ఏ మీడియాలోనూ లేదా ఏ జర్నలిస్టు కూడా మా తొలి టెస్టు కెప్టెన్ లేకుండా జరిగిందనే విషయం రాయలేదు. గాయం కారణంగా మా కెప్టెన్ రెండు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేయలేకపోయాడని గంభీర్ వివరించారు.
IND vs SA: టీమిండియా విజయానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే..
నేను ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో సాకులు చెప్పను. అలాగని మీరు నిజాలను ప్రపంచానికి లేదా దేశానికి చూపవద్దని కాదు. జట్టు మార్పు దశలో ఉన్నప్పుడు, రెడ్ బాల్ క్రికెట్‌లో మీ ముఖ్య బ్యాటర్‌తో పాటు కెప్టెన్‌ను కోల్పోయినప్పుడు ఇలాంటివి జరుగుతాయని గంభీర్ తన అసంతృప్తిని వెలిబుచ్చారు. గిల్ ఫామ్‌లో ఉన్నప్పటికీ అతని సేవలను అందుబాటులో లేకపోవడం గురించి ఎవరూ మాట్లాడలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Coach Gautam Gambhir’s voice got a bit too loud after Rohit and Virat won the series.😂 pic.twitter.com/eYoQMwlji1
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 6, 2025
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు