వ్యాపారం ప్రమోషన్ కోసం తమ నెంబర్లను సోషల్ మీడియాతో పాటు ఎక్కడపడితే అక్కడ పెడితే ఇబ్బందులు ఎదుర్కొక తప్పవు.. ఒక వ్యాపారవేత్తకు ఇదే అనుభవం ఎదురయింది.. వ్యాపారవేత్తకు ఫోన్ చేసి వ్యాపార విషయాలు అడిగి చివరకు తక్కువ ధరికే బంగారం ఇప్పిస్తామని చెప్పి కోటి రూపాయలను కొట్టేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఓ రియల్టర్ వ్యాపారాభివృద్ధి కోసం తన పేరు, ఫోన్ నెంబర్ కార్యాలయంపై రాసుకోవడమే శాపమైంది. అలా లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా ఆయనకు కాల్ చేసిన కర్ణాటక ముఠా తక్కువ ధరకు బంగారం పేరుతో రూ. 65 లక్షలు స్వాహా చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అఫ్జల్‌గంజ్ పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. ఫలితంగా ప్రధాన సూత్రధారిని పట్టుకోవడంతో పాటు రూ. 40 లక్షలు రికవరీ చేశారు.
READ MORE: TEJESHWAR Case: గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..
కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన కొన్ని ముఠాలు తెలుగు రాష్ట్రాలనే టార్గెట్‌గా చేసుకుని మోసాలు చేస్తున్నాయి. పొలం దున్నుతుంటేనో, పాత ఇంటిని కూలుస్తుంటేనో నిధి లభించిందని చెప్తారు. అందులో ఉన్న బంగారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా దాచామని, సగం ధరకే ఇస్తామంటూ ఎర వేస్తారు. వీళ్లు టార్గెట్లను ఎంచుకోవడానికి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ వ్యాపార ప్రకటనలు, దుకాణాలపై ఉన్న పేర్లు, ఫోన్ నెంబర్లు ఎంచుకుంటారు. వీరి వల్లోపడుతున్న వారిలో అత్యధికులు రియల్టర్లు, చిన్న స్థాయి బంగారం వ్యాపారులే ఉంటున్నారు.. ఇలాంటి ముఠాల్లో తాళ్ల వ్యాపారి జయ కుమార్‌ది ఒకటి. తన బావమరిది ఉదయ్, స్నేహితుడు సందీప్‌తో కలిసి రంగంలోకి దిగాడు. చౌటుప్పల్‌కు చెందిన మునుకుంట్ల నిరంజన్ అక్కడి భరత్‌నగర్ కాలనీలో శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నారు. జయ కుమార్ నేతృత్వంలోని ముఠా ఈ ఏడాది మార్చిలో ద్విచక్ర వాహనాలపై సిటీకి వచ్చింది.
READ MORE: Shamshabad: ఏకంగా ఇంట్లోనే గంజాయి సాగు..
చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తూ టార్గెట్ల కోసం అన్వేషించింది. చౌటుప్పల్‌లో సంచరిస్తున్నప్పుడు వారి కంట్లో నిరంజన్ కార్యాలయం బోర్డు పడింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా రెడ్డి పేరుతో ఉదయ్ సంప్రదించాడు. సగం ధరకు బంగారమంటూ ఎర వేశాడు. అదే నెల్లో 25 వేలు తీసుకుని అరతులం బంగారం ఇచ్చాడు. దీన్ని పరీక్షించిన నిరంజన్ మేలిమి బంగారంగా తెలుసుకున్నారు. ఆపై తన స్నేహితుడు దేవేందర్‌తో కలిసి 65 లక్షలకే కేజీ ఖరీదు చేయడానికి సిద్ధయ్యారు. ఈ సందర్భంలో వీరితో రఘు పేరుతో సందీప్ కూడా సంప్రదింపులు జరిపాడు.. నెల 12న కేజీ బంగారం సిద్ధంగా ఉందని ఫోన్ చేసిన రఘు నగదు తీసుకుని పెద్ద అంబర్‌పేట రమ్మని చెప్పాడు. దీంతో నిరంజన్ 45 లక్షలు, ఇతడి స్నేహితుడైన ధర్మేంద్ర 20 లక్షలు, ఇద్దరూ కలిసి 65 లక్షలు తీసుకుని తమ కారులో పెద్ద అంబర్‌పేటకు వచ్చారు. నిరంజన్‌తో ఫోనులో సంప్రదింపులు జరుపుతున్న రెడ్డి…
READ MORE: TEJESHWAR Case: గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..
అక్కడ నుంచి వారిని ఎల్బీనగర్కు, ఆపై దిల్సుఖ్నగర్ రప్పించి చివరకు ఎంజీబీఎస్ సమీపంలోకి రమ్మన్నారు. అక్కడ వీరిని కలిసిన రఘు వారి వాహనంలోనే ఎక్కాడు. కొద్దిసేపటికి ద్విచక్ర వాహనంపై వచ్చిన జయ కుమార్, రెడ్డి బంగారం ఉందంటూ ఓ బ్యాగ్ ఇచ్చి, నగదుతో కూడిన బ్యాగ్ పట్టుకుపోయారు. అప్పటి వరకు వారితోనే ఉన్న రఘు సైతం దృష్టి మళ్లించి మరో వాహనంపై ఉడాయించాడు. నిరంజన్ ఆ బ్యాగ్ తెరిచి చూడగా… పైన చీరలు, కింద నాపరాళ్లు కనిపించడంతో మోసపోయినట్లు గుర్తించాడు.. చాదర్‌ఘాట్‌లోని ఎంజీబీఎస్ సమీపంలో ఘటన జరిగింది.రంగంలోకి దిగిన పోలీసులు..సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 40 లక్షలు రికవరీ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు..