వ్యాపారం ప్రమోషన్ కోసం తమ నెంబర్లను సోషల్ మీడియాతో పాటు ఎక్కడపడితే అక్కడ పెడితే ఇబ్బందులు ఎదుర్కొక తప్పవు.. ఒక వ్యాపారవేత్తకు ఇదే అనుభవం ఎదురయింది.. వ్యాపారవేత్తకు ఫోన్ చేసి వ్యాపార విషయాలు అడిగి చివరకు తక్కువ ధరికే బంగారం ఇప్పిస్తామని చెప్పి కోటి రూపాయలను కొట్టేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఓ రియల్టర్ వ్యాపారాభివృద్ధి కోసం తన పేరు, ఫోన్ నెంబర్ కార్యాలయంపై రాసుకోవడమే శాపమైంది. అలా లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా…
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ డీలక్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి.