Ponguleti Srinivas Reddy : పదేళ్ల పాలనకు.. ఏడాది ఇందిరమ్మ పాలనకు స్పష్టమైన తేడా ఉందని, మా ప్రభుత్వం వచ్చాక ధరణిని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేము వచ్చే నాటికి 2 లక్షల 40 వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. డిసెంబర్ 1 నుంచి ధరణి పోర్టల్ ను NIC కి అప్పగించామని, 2024…
వీఆర్ఏలకు డీఏను రూ.300 నుంచి 500కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి వెల్లడించారు. డీఎను పెంచుతూ ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో వీఆర్‌ఏలకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా వీఆర్‌ఏలు ఎదురుచూస్తున్న అంశంపై ఇవాళ శుభవార్త అందించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో తొలగించిన ఓ ఆర్ధిక ప్రయోజనాన్ని వారికి తిరిగి కల్పించడంతో పాటు దాన్ని పెంచాలని కూడా నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్రంలోని వీఆర్ఏల సర్దుబాటు కోసం సీఎం కేసీఆర్ సర్కార్ మార్గం సుగమం చేసింది. వివిధ శాఖల్లో కొత్తగా 14,954 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలను ఇతర శాఖలకు పంపేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను నేడు (మంగళవారం) రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జారీ చేశారు. జిల్లాలు, శాఖలు, పోస్టు కేటాయించేందుకు అవసరమైన సమాచారాన్ని పంపాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలోని 24 వేల మంది వీఆర్ఏల్లో 5,950 మందిని నీటి పారుదల శాఖలో లష్కర్లుగా నియమించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరందరు రెవెన్యూ శాఖలో రూ.10.500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వారి సేవలను అదేశాఖలో క్రమబద్దీకరించడంతో పాటు కొత్త పేస్కేల్ ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
నిన్న శాసన సభలో కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ తో VRA లు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ముట్టడికి వీఆర్‌ఏలు పెద్ద ఎత్తున తరలి రావడంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ సమావేశాల్లో pay స్కెల్ ప్రకారం జీతం ఇస్తాం అని చెప్పిన కేసీఆర్ మాట తప్పారంటూ ఆరోపించారు. Pay స్కెల్ విధానం లేకుండా ఇస్తున్న జీతం సరిపోవడం లేదని నిరసన వ్యక్తం చేసారు. కేవలం 12 వేల లోపే ప్రస్తుతం జీతం వస్తూడడంతో VRA…