Hombale Films – RCB: ఎన్నో ఏళ్ల కలను నిజం చేసుకొని IPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్‌ను ముద్దాడింది. తాజాగా ఈ ఐపీఎల్ జట్టు మరొక సారి వార్తల్లో నిలిచింది. ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పటి నుంచి వినిపిస్తు్న్న జట్టు యాజమాన్యం మార్పు అనేది దాదాపుగా ఖాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్సీ్బీ యాజమాన్య సంస్థ డియోజియో పీఎల్‌సీ. అయితే ఈ సంస్థ తమ ఐపీఎల్ ఫ్రాంఛైజీని విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ టైటిల్ విన్నర్ జట్టును కొనుగోలు చేయడానికి పోటీలో ఉన్న కంపెనీలు ఏంటి, హోంబలే ఫిల్మ్స్ ప్లాన్ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: I Bomma Ravi : చంచల్ గూడ జైలుకు ఐ బొమ్మ రవి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఓనర్‌షిప్ కోసం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వంటి కంపెనీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. తాజా అప్డేట్ ఏమిటి అంటే ఆర్సీబీ టీమ్ కొనుగోలు కోసం కన్నడ ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పోటీలోకి వచ్చినట్లు తెలుస్తుంది. విజయ్ కిరగందూర్, చలువే గౌడ కలిసి 2012లో ‘హోంబలే ఫిల్మ్స్’ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ 2014లో ‘నిన్నిందలే’ అనే కన్నడ సినిమా నిర్మించింది. ఆ తర్వాత యష్‌తో ‘మాస్టర్‌పీస్’, పునీత్ రాజ్‌కుమార్‌తో ‘రాజకుమార’ వంటి సినిమాలని నిర్మించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది. అనంతరం హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన ‘కే.జీ.ఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో చరిత్ర సృష్టించాయి. ఈ ఏడాది ‘మహావతార్ నరసింహా’ పేరుతో యానిమేషన్ మూవీని తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో డిస్టిబ్యూట్ చేసి, భారీ లాభాలు చవిచూసింది.
దీంతో 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త యాజమాన్యం నిర్వహణలో మ్యాచులు ఆడనుంది. డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ ప్లేస్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చినట్టే.. వచ్చే సీజన్ నుంచి ఆర్‌సీబీ టీమ్ పేరు కూడా మారతుందని సమాచారం. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆర్సీబీ జట్టు విక్రయానికి రూ.17 వేల కోట్ల కొటేషన్ కోరుతున్నట్టు టాక్ నడుస్తుంది. ఇంత భారీ మొత్తాన్ని హోంబల్ ఫిల్మ్స్ సమకూర్చగలదా? అనే అనుమానాలు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్రేమికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. 2026 మార్చి 31 నాటికి ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం.
READ ALSO: Senuran Muthusamy: సౌతాఫ్రికా క్రికెటర్ ముత్తుసామికి తమిళనాడుతో సంబంధం ఉందా?