I Bomma Ravi : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఐదు రోజుల కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఐ బొమ్మ రవిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కస్టడీలో రవి నుంచి కీలక విషయాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. రవి పర్సనల్ విషయాలతో పాటు, అసలు హైదరాబాద్ కు ఎందుకు వచ్చాడు అనేది తెలిసింది. అలాగే పైరసీ ఎలా చేసేవాడు, ఎలాంటి నెట్ వర్క్ ఉంది అనే వాటిపై ప్రశ్నలు వేశారు పోలీసు అధికారులు. పైరసీ ద్వారా వచ్చిన డబ్బులతో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసినట్టు ఇప్పటికే రవి వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే .
Read Also : Draupathi 2 : ‘ద్రౌపది 2’ నుంచి రక్షణ ఫస్ట్ లుక్ రిలీజ్
నెదర్లాండ్స్ సిటిజన్ షిప్ ను తీసుకున్నాడు రవి. అలాగే డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేశానని, పైరసీలో తానొక్కడినే ఉన్నట్టు తెలిపాడు. ఇక బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి వచ్చిన డబ్బుల ట్రాన్సక్షన్, ఫ్యామిలీ వివరాలను కూడా తెలిపాడు. కస్టడీలో అత్యంత కీలక విషయాలను తెలుసుకున్నారు పోలీసు అధికారులు. ఈ ఆధారాలతో ఐ బొమ్మ పైరసీ నెట్ వర్క్ ను చేధించే పనిలో పడ్డారు. కాకపోతే పైరసీ నెట్ వర్క్ కు సంబంధించిన కీలక విషయాలను రవి బయట పెట్టలేదని సమాచారం అందుతోంది. వాటిని తెలుసుకునేందుకు ఎథికల్ హ్యాకర్స్ ను పిలిపించబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు.
Read Also : I Bomma Ravi : పైరసీ నెట్ వర్క్ పై నోరు విప్పని రవి..?