Senuran Muthusamy: భారత జట్టు గౌహతిలో సౌతాఫ్రికాతో రెండో టెస్టు ఆడుతోంది. వాస్తవానికి ఎంతో ఉత్సాహంగా ఈ టెస్టు మ్యాచ్‌ను మొదలెట్టిన భారత జట్టుకు సౌతాఫ్రికా బ్యాటర్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ ఆ బ్యాటర్ ఎవరనుకుంటున్నారు.. సెనూరన్ ముత్తుసామి. ఈ సౌతాఫ్రికా బ్యాటర్ క్రీజులో పాతుకుపోయి ఏకంగా 194 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో హైలెట్ ఏమిటంటే ముత్తుసామికి ఇదే మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీ.. ఇంతకీ సెనూరన్ ముత్తుసామి తమిళనాడుతో ఏమైనా సంబంధం ఉందా అనేది.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: I Bomma Ravi : పైరసీ నెట్ వర్క్ పై నోరు విప్పని రవి..?
7వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ముత్తుసామి.. మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా వంటి వరల్డ్ క్లాస్ టీమిండియా బౌలర్ల బౌలింగ్‌లో సునాయాసంగా బౌండరీలు బాదేశాడు.. క్వింటన్ డి కాక్, లాన్స్ క్లాసెనర్ తర్వాత.. భారత జట్టుపై లోయర్ ఆర్డర్‌లో సెంచరీ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 2019ల తొలిసారిగా సెనూరన్ ముత్తుసామి ఇండియాపైనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేశాడు. 2019, అక్టోబర 2న ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని అవుట్ చేసి, మొట్టమొదటి అంతర్జాతీయ వికెట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటిదాకా 6 ఏళ్లలో సెనూరన్ ముత్తుసామి కేవలం 7 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు మాత్రమే ఆడగలిగాడు. గౌహతి టెస్టు సెంచరీతో ముత్తుసామి, అంతర్జాతీయ కెరీర్‌కి టర్నింగ్ దక్కుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంతకీ ఎవరీ ముత్తుసామి…
సెనూరన్ ముత్తుసామి.. భారతీయ క్రికెట్ అభిమానులు మర్చిపోలేని పేరు. ఇక్కడే చాలా మందికి ఒక అనుమానం వస్తుంది.. ఇంతకీ ఈ ముత్తుసామి భారతీయుడా అని. మీ అనుమానం సగం నిజం. ఎందుకంటే సెనూరన్ ముత్తుసామి పూర్తిగా భారతీయుడు కాదు. కానీ భారత సంతతికి చెందినవాడు. సెనూరన్ ముత్తుసామి తండ్రి ముత్తుసామి తమిళనాడులోని నాగపట్నం ఏరియాకి చెందినవాడు. బతుకుతెరువు కోసం సౌతాఫ్రికాకి వెళ్లిన ఆయన అక్కడే డర్భన్‌లో సెటిల్ అయ్యాడు. ఈక్రమంలో ఆయనకు 1994, ఫిబ్రవరి 22న సెనూరన్ ముత్తుసామి జన్మించాడు. అలా ఈ సెనూరన్ ముత్తుసామి సగం భారతీయుడు అయ్యాడు.
READ ALSO: New Labour Codes: అమలులోకి కొత్త లేబర్ కోడ్‌లు.. కార్మికులు తప్పని సరిగా తెలుసుకోవాల్సినవి ఇవే