RCB For Sale: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీని విక్రయానికి ఉంచారు. ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) రెండింటిలోనూ పాల్గొంటున్న ఈ జట్టును ప్రస్తుతం కలిగి ఉన్న డియాజియో (Diageo) సంస్థ విక్రయ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. ఈ విక్రయాన్ని మార్చి 31, 2026 నాటికి పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2008 నుంచి ఐపీఎల్‌లో భాగమైన RCB జట్టు 2025లో మొదటిసారిగా పురుషుల అగ్రశ్రేణి ఫ్రాంచైజీ లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది. అలాగే 2024లో WPL టైటిల్‌ను కూడా సాధించారు. RCB జట్టులో విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన, జోష్ హేజిల్‌వుడ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
Namo Jersey: టీమిండియా మహిళల జట్టుతో ప్రధాని మోదీ భేటీ.. పీఎంకు సర్‌ప్రైజ్ గిఫ్ట్..!
యూనైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) మాతృ సంస్థ అయిన డియాజియో RCB ఫ్రాంచైజీకి సుమారు 2 బిలియన్ అమెరికన్ డాలర్స్ (రూ. 16,600 కోట్లు) విలువను ఆశిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. మార్చి 31, 2025తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ మొత్తం లాభంలో క్రీడా వ్యాపారం ద్వారా 8.3 శాతం వాటా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం వ్యాక్సిన్ కింగ్ అదర్ పూనావాలా ఈ క్రీడా వ్యాపారాన్ని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మకం పక్రియ మార్చి 31, 2026 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నప్పటికీ ఈ లోపు ఫ్రాంచైజీ నవంబర్ 27న జరగబోయే WPL వేలంలో ఆటగాళ్ల కోసం బిడ్ వేయనుంది. అంతేకాకుండా రాబోయే ఐపీఎల్ సీజన్లలో కూడా పాల్గొంటుంది.
Kidney Stones: ఈ అలవాట్లు మార్చకోకపోతే మీ కిడ్నీలను మర్చిపోవాల్సిందే.. జాగ్రత్త గురూ..!