టీమిండియా మాజీప్లేయర్, లెజెండ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా మొదటి టెస్టులో మన బ్యాటర్లు సెంచరీలు చేసిన విధానంపై అసహనం వ్యక్తం చేశాడు. మొదటి టెస్టులో మనవాళ్లు 5 సెంచరీలు చేశారు. కానీ డాడీ హుండ్రేడ్స్ ఎక్కడా.. అని ప్రశ్నించాడు. అవి చేయలేదు కాబట్టే మ్యాచ్ ఓడిపోయారు. అంతే కాదు కొంతమంది బ్యాటర్లు డిఫెన్సివ్ మోడ్ లో బ్యాటింగ్ చేశారు అని ఆరోపించాడు.
ఇషాన్ కిషన్ అద్బుత ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కీలక విషయాలు వెల్లడించారు. ఇషాన్ కిషన్.. ముంబై ఇండియన్స్ (MI)కు ఆడిన సమయంలో వెనుకబడిపోయాడని.. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో అతనికి కావాల్సిన స్వేచ్ఛ లభించిందని అభిప్రాయపడ్డారు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలి గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఒక ఆసక్తికరమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ దూకుడు విధానాన్ని విరాట్ కోహ్లీ అవలంబించకూడదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతల గురించి ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ తమ అంచనాలను వెల్లడించారు. మైఖేల్ అథర్టన్ మాట్లాడుతూ.. " దక్షిణాఫ్రికాకు మద్ధతిస్తున్నాను. ప్రతి టోర్నమెంట్‌లో గెలిచే వరకు పోరాడతారు. సౌతాఫ్రికా జట్టు బలంగా ఉంది. ఈ ట్రోఫీని దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంటుంది." అని మైఖేల్ అథర్టన్ తెలిపాడు. మాజీ ఇంగ్లీష్ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈసారి భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్‌కు చేరుకుంటాయని అభిప్రాయపడ్డాడు. అంతే…