Ravichandran Ashwin Become Team India 2nd Leading Wicket-Taker In International Cricket: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో విండీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ తీసిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో మొత్తంగా 131 పరుగులు ఇచ్చి 12 వికెట్లు తీసి.. కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. దాంతో మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు.
Ravichandran Ashwin Records:
రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్స్ తీసిన రెండో బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌నిలిచాడు. ఈ క్రమంలో హర్భజన్ సింగ్‌ను (707) యాష్ అధిగమించాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 709 వికెట్లు ఉన్నాయి. టెస్టుల్లో 486 వికెట్లు, వన్డేల్లో 151, టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. ఇక అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ముందున్నాడు. జంబో 953 వికెట్స్ తీశాడు. ఇక యాష్ కుంబ్లేను టార్గెట్ చేశాడు. అయితే అది సులువు మాత్రం కాదు.
365 అంతర్జాతీయ మ్యాచ్‌లలో హర్భజన్ సింగ్ 707 వికెట్లు పడగొట్టాడు. 43 ఏళ్ల హర్భజన్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం 103 టెస్టులు, 236 వన్డేలు మరియు 28 టీ20లు భారత్ తరఫున ఆడాడు. టెస్టుల్లో 417, వన్డేల్లో 269 మరియు టీ2ల్లో 25 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో హర్భజన్ మొత్తం వికెట్ల సంఖ్య 711. అయితే ఇందులో 4 వికెట్స్.. 2007లో జరిగిన ఆఫ్రో-ఆసియా కప్‌లో ఆసియా XI తరపున తీశాడు.
Also Read: Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. జ్యుడీషియల్ కస్టడీకి ముగ్గురు రైల్వే అధికారులు
ఆర్ అశ్విన్ ఈ మ్యాచ్‌లో 12 వికెట్లు తీశాడు. ఒకే మ్యాచ్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది ఎనిమిదోసారి. ఈ క్రమంలో అనిల్ కుంబ్లేతో యాష్ సమంగా నిలిచాడు. కుంబ్లే టెస్టుల్లో 10 ప్లస్ వికెట్లను ఎనిమిది సార్లు తీశాడు. అశ్విన్ 5 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 34వసారి. ఐదు వికెట్ల ప్రదర్శనప్పుడు జట్టు విజేతగా నిలవడం ఇది 28వ సారి. స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ (41) అత్యధిక విజయాల్లో భాగస్వామ్యం అయ్యాడు.
వెస్టిండీస్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (12/131) నమోదు చేసిన రెండో భారత బౌలర్ ఆర్ అశ్విన్. నరేంద్ర హిర్వాణి (16/126) యాష్ కంటే ముందు ఉన్నాడు. విదేశాల్లో అత్యుత్తమ బౌలింగ్ నమోదు చేసిన మూడో బౌలర్‌గానూ మరో రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ఆసీస్‌పై భగవత్ చంద్రశేఖర్ (12/104), ఇర్ఫాన్ పఠాన్ (12/126) ఉన్నారు.