Samsung Galaxy Z Flip 5 and Samsung Galaxy Z Fold 5 Price Leak in India: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ రెండు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 (Samsung Galaxy Z Fold 5), శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (Samsung Galaxy Z Flip 5) పేరుతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేయనుంది. జూలై 26న జరిగే ఈవెంట్‌లో శాంసంగ్ ఈ రెండు ఫోన్‌లను ప్రదర్శించనుంది. లాంచ్‌కి ఇంకా కొంత సమయం ఉన్నా.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లపై పలు లీక్‌లు బయటికి వచ్చాయి. జెడ్ ఫ్లిప్ 5, జెడ్ ఫోల్డ్ 5 ఫోన్‌ల ధరలు తాజాగా వెల్లడయ్యాయి.
Samsung Galaxy Z Flip 5 Price:
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర భారత దేశంలో సుమారు రూ. 1,09,830గా ఉంటుందని లీక్‌ల ద్వారా వెల్లడైంది. ఇది మునుపటి మోడల్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 కంటే సుమారు రూ. 4,580 ఎక్కువ.గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ధర 89,999. ఈ ఫోన్ బ్లూ, ప్లాటినం, లేత గోధుమ రంగు, నలుపు, లైట్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనుంది.
Samsung Galaxy Z Fold 5 Price:
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 1,73,960గా ఉంటుందట. మునుపటి మోడల్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 కంటే రూ. 25,320 ఎక్కువ. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ధర భారతదేశంలో రూ. 1,54,999. ధరల పెంపును శాంసంగ్ పరిశీలిస్తోందని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. అయితే భారతీయ ధర యూరోపియన్ మార్కెట్ల కంటే కొంచెం తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. జెడ్ ఫోల్డ్ 5 ధరలో 100 యూరోల పెరుగుదల ఉంటుందట. అంటే భారతదేశంలో దాదాపు రూ. 9,160.
Samsung Galaxy Z Flip 5 Specifications:
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాససర్, 4100 mAh బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్ 6.82 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను కలిగి ఉంటుంది. 12జీబీ ర్యామ్.. 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజీ సదుపాయం ఇందులో ఉండనున్నాయి. 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సెల్ఫీ కోసం 12 ఎంపీ కెమెరా ఉండనుంది.
Samsung Galaxy Z Fold 5 Specifications:
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5లో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాససర్ ఉంటుంది. 4400 mAh బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్.. QXGA+ అమోలెడ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. ఇందులో 12జీబీ ర్యామ్ ఉండగా.. 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజీ సదుపాయంతో రానుంది. 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 64-మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్ మరియు 12-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
Also Read: WI vs IND: అశ్విన్ స్పిన్ మాయాజాలం.. తొలి టెస్టులో భారత్‌కు ఇన్నింగ్స్ విజయం!