Ravichandran Ashwin: భారత క్రికెట్ జట్టు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుతో పుణెలో జరుగుతున్న రెండో టెస్టు సిరీస్‌లో అతను ఈ రికార్డును సాధించాడు. దీంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Read Also: Drug Soldiers: డ్రగ్స్ పై ప్రభుత్వం సరికొత్త యుద్ధం.. సోల్జర్స్‌గా ప్రభుత్వ ఉద్యోగులు..
న్యూజిలాండ్‌పై మూడో వికెట్ తీసిన అశ్విన్ ఈ మైలురాయిని సాధించాడు. అశ్విన్ దింతో ఆస్ట్రేలియా దిగ్గజం నాథన్ లియాన్ (530)ను అధిగమించి ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా నిలిచాడు. సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్‌లో ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ అండర్సన్ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563) మాత్రమే అశ్విన్ కంటే ఎక్కువ వికెట్లు తీశారు. ఇక మరోవైపు అశ్విన్ డబ్ల్యూటీసీ మూడు రౌండ్స్ లో కలిపి మొత్తం 39 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను దాదాపు 20 సగటుతో 189 వికెట్లు పడగొట్టాడు.
Read Also: Navya Haridas: వయనాడ్లో టూరిస్ట్ ప్రదేశాలు చూపిస్తామని ప్రియాంక సభకు ప్రజలను తీసుకెళ్లారు..
ఈ లిస్ట్ లో అశ్విన్ తర్వాత ఆస్ట్రేలియా స్పిన్నర్ 43 టెస్టుల్లో 26.70 సగటుతో 187 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో 22.81 సగటుతో 175 వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ మూడో స్థానంలో ఉన్నాడు. అయితే, అశ్విన్ మినహా మరే భారత బౌలర్ కూడా 150 వికెట్లను అందుకోలేకపోయారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న టీమిండియా, న్యూజిలాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ లో 4 వికెట్లు కోల్పోయి 198 పరుగులతో ఆడుతోంది.