Site icon NTV Telugu

Raveena Tandon : నీ భర్తకు నేను ఫ్యాన్ అయ్యాను!” – యామికి రవీనా స్పెషల్ కాల్

Raveena Tandar, Yamigoutham

Raveena Tandar, Yamigoutham

గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. దాదాపు రూ. 1300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మేజిక్ ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ తన స్పందనను తెలియజేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చూసిన వెంటనే రవీనా టండన్, డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య (హీరోయిన్) యామి గౌతమ్ కు ఫోన్ చేశారట.

Also Read : Tirumala : శ్రీవారి గర్భాలయం పేరు ‘ఆనంద నిలయం’ అని ఎందుకు పిలుస్తారొ తెలుసా? దీని వెనుక ఉన్న గూఢార్థం ఇదే!

‘యామి.. ఐయామ్ సారీ. నేను నీ భర్తకు పెద్ద అభిమానిని అయిపోయాను. నా అటెన్షన్ అంతా ఇప్పుడు ఆయన మీదే ఉంది’ అని సరదాగా సారీ చెప్పానని రవీనా వెల్లడించారు. ఆదిత్య ధర్ ఒక మేధావి అని, చాలా కాలంగా మిస్ అవుతున్న ప్రాపర్ సినిమా ఫీలింగ్‌ను ఆయన మళ్ళీ తెచ్చారని ఆమె కొనియాడారు. ఆర్డినరీ సినిమాల కంటే పుష్ప, కేజీఎఫ్, ధురంధర్ లాంటి సినిమాలు చూసినప్పుడే ప్రేక్షకులకు అసలైన సంతృప్తి దక్కుతుందని రవీనా పేర్కొన్నారు. ఇక రణ్‌వీర్ సింగ్ గురించి చెబుతూ.. అతను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన షూటింగ్ చూడటానికి వచ్చేవాడని, ఇప్పుడు ధురంధర్‌లో అతని నటన మైండ్ బ్లోయింగ్ అని ప్రశంసించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కూడా అద్భుతంగా నటించారని ఆమె చెప్పుకొచ్చారు. ధురంధర్ సక్సెస్‌తో దీనికి సీక్వెల్‌గా ‘ధురంధర్: ది రివేంజ్’ సిద్ధమవుతోంది. ఈ ఏడాది మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇదే రోజున కన్నడ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ కూడా రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోరు నెలకునేలా ఉంది.

Exit mobile version