Pawan Kalyan : రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో కలకలం రేగింది. ఇవాళ ఆయన కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యం, అలాగే మరో బార్జ్ ఐవీ 0073 లో 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.6.64 కోట్లుగా అంచనా.
Ponnam Prabhakar: త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ముగించుకుని మంగళగిరి చేరిన వెంటనే ఈ అంశంపై దృష్టి సారించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి, అక్రమ రవాణా పై చర్యలు తీసుకునేందుకు కాకినాడ పోర్టుకు వెళ్లారు. పిడిఎఫ్ పథకం ద్వారా సరఫరా అయ్యే బియ్యం, పేదలకు చేరకుండానే విదేశాలకు ఎగుమతవుతోంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు ద్వారా ఈ రవాణా జరగుతుండటంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ దందా పీక్స్ కి చేరిందని, ఇప్పటికీ అదే సమస్య కొనసాగుతోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
కాకినాడ పోర్టులో పౌరసరఫరాల శాఖ మంత్రితో పాటు సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ పర్యవేక్షణలో తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేరుగా బియ్యం రవాణా చేస్తున్న షిప్పును అడ్డుకుని, భారీ బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం పేదలకు రూపాయికే కేజీ బియ్యం అందిస్తుంటే, అక్రమార్కులు ఆ బియ్యాన్ని వివిధ మార్గాల ద్వారా పోర్టుకు తరలించి, సొంత నౌకల్లో విదేశాలకు తరలిస్తున్నారు. ఇందులో పలు శాఖల సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కూటమి ప్రభుత్వం సమస్యను మూలంగా పరిష్కరించాలని కట్టుబడి ఉంది. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా పౌరసరఫరాల శాఖ సీరియస్‌గా చర్యలు చేపడుతోంది.
S Jaishankar: పాక్ విషయంలో మారిన భారత వైఖరిని క్రికెట్‌తో పోల్చిన జైశంకర్