ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన సిట్‌కు చీఫ్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌కు బాధ్యతలు అప్పగించారు. సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, బాలసుందర రావు, గోవిందరావు, రత్తయ్య.. మొత్తం చీఫ్ సహా ఆరుగురితో సిట్‌ను ఏర్పాటు చేసింది.
Pawan Kalyan : రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో కలకలం రేగింది. ఇవాళ ఆయన కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యం, అలాగే మరో బార్జ్ ఐవీ 0073 లో 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయాన్ని లేఖ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దుల్లో జోరుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతోందన్న ఆయన.. తమిళనాడు-చిత్తూరు సరిహద్దుల్లోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తున్నారని.. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో గట్టి నిఘా పెంచాలని లేఖలో పేర్కొన్నారు. అంతే కాదు, స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల…