సినిమా ఇండస్ట్రీలో అందంగా ఉంటేనే ఆఫర్స్ వస్తాయి.. దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే హీరోయిన్లు చూస్తున్నారు.. వయస్సులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని ఫిట్నెస్ కోసం జిమ్ లలో కష్టపడుతూ చెమటలు చిందిస్తున్నారు.. హీరోయిన్ల అందం వెనుక ఇంత కష్టం ఉందా అంటూ అభిమానులు షాక్ అవుతుంటారు.. చాలా మంది హీరోయిన్లు జిమ్ లో కష్టపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు అంటే యూత్ కు బాగా ఇష్టం.. ఇటీవల సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది. గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో అక్కడ కూడా డిమాండ్ పెరగడంతో పాటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంటుంది.. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..
తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలతో పాటుగా సినిమాల విశేషాలను కూడా పంచుకుంటుంది.. తాజాగా తాను వర్కౌట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ పుష్ప2 లో చేస్తుంది.. అలాగే హిందీలోనూ అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు.. కమెర్షియల్ మూవీస్ తో పాటు, లేడీ ఓరియేంటెడ్ మూవీస్ లలో కూడా నటిస్తుంది..