వరసగా అగ్ర హీరోల పక్కన ఛాన్సులు సంపాదిస్తూ, హిట్లు అందు కుంటూ దూసుకుపోతుంది రష్మిక మందన్నా. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. తన అందం, అభినయంతో తెలుగువారిని ఇప్పటికే కట్టిపడేసింది. తన అందంతో కుర్ర కారుకు పిచ్చెక్కిస్తున్న రష్మిక మందన్నా మరో ఆఫ్ కొట్టేసినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నేషనల్ క్రష్‌గా ఇప్పటికే ఫేమ్ సంపా దించిన ఈ అమ్మడు తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంది. కాగా నేషనల్ క్రష్‌గా ఫేమ్ సంపాదించిన ఈ అమ్మడు తాజాగా బాలీవుడ్లో తను వెడ్స్ మను, జీరో, అంతరంగీ రే వంటి విభిన్న సిని మాలు తీసిన ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రానున్న ఓ కొత్త మూవీలో రష్మిక నటించనుందని సమాచారం.
దీనికోసం ఇప్పటికే చిత్ర బృందం ఈ భామను సంప్రదించిందట. కథ ఈ బ్యూటీకి నచ్చిందా? ప్రాజెక్టు ఓకే చేసిందా? అనేది తెలి యాల్సి ఉంది. రష్మిక ఇప్పటికే బాలివుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా ఆ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. సినిమా విడుదల కాకముందే బాలీ వుడ్లో మరో అవకాశం రావడంతో ఈ భామ సంతోషం వ్యక్తం చేస్తుంది. తెలుగులో గీతాగోవిందం, డియర్ కామ్రేడ్, ఛలో, భీష్మ, సరిలేరు నీకెవరు, దేవదాస్ చిత్రాల్లో నటించింది. కాగా పుష్ప మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా పై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది.