Ranveer Singh-Prasanth Varma: ఇది సరైన సమయం కాదు.. రణవీర్-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranveer Singh-Prasanth Varma Movie Part ways: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మల ప్రాజెక్ట్ గురించే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. రణవీర్-ప్రశాంత్ కాంబోలో ‘రాక్షస’ అనే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోందని, ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయని, ఈ సినిమా నుంచి రణ్‌వీర్ వైదొలిగాడని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పడింది. ప్రస్తుతానికి ఈ సినిమాను పక్కన పెట్టినట్లు హీరో, డైరెక్టర్ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. సినిమాకు ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు.
‘ప్రశాంత్ వర్మ టాలెంట్ డైరెక్టర్. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాం. ఐడియా కూడా అనుకున్నాం. భవిష్యత్తులో మేము ఈ సినిమా కోసం పని చేస్తామని ఆశిస్తున్నా’ రణ్‌వీర్ సింగ్ పేర్కొన్నారు. ‘రణవీర్ సింగ్ లాంటి ప్రతిభవంతుడైన నటుడు, ఫుల్ ఎనర్జీ ఉన్న వ్యక్తి అరుదుగా ఉంటారు. భవిష్యత్తులో మేం కలిసి పని చేస్తాం’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సింగ్ కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా ప్లాన్ చేసింది.
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
Also Read: IND vs PAK T20 World Cup 2024: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు.. ఆందోళనలో ఫాన్స్!
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సూపర్ హిట్‌గా నిలిచిన హనుమాన్‌కు ఇది సీక్వెల్‌గా రానుంది. జై హనుమాన్ అనౌన్స్ చేసినా.. ఇంకా క్యాస్టింగ్ కంప్లీట్ కాలేదు. దాంతో ప్రశాంత్ తదుపరి సినిమా ఏంటి? అనే ఆసక్తి మొదలు అయ్యింది. హనుమాన్‌కు ముందు అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ ఒక సినిమా మొదలెట్టారు. మరి ఆ సినిమాను విడుదల చేస్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?