టాలీవుడ్ భల్లాలదేవ రానా దగ్గుబాటి ఎప్పుడూ తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ముంబయిలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఆయన ‘బెట్టింగ్ యాప్’ వివాదంపై తొలిసారిగా పెదవి విప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు, సీఐడీ విచారణ వంటి విషయాలపై ఆయన చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు.. ‘చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, మనమందరం చట్టానికి కట్టుబడి ఉండాల్సిందే’ అని రానా స్పష్టం చేశారు. తాను ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్ చేసే ముందు దాని గురించి పూర్తిగా పరిశీలించిన తర్వాతే సంతకం చేస్తానని తెలిపారు. గత నవంబరులో సీఐడీ విచారణకు కూడా హాజరైన రానా, అది చట్టబద్ధమైన యాప్ అని తెలిసిన తర్వాతే తాను ప్రచారం చేశానని మీడియాకు వివరించాడు రానా. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
Also Read : Suriya 47: చెన్నైలో..పూజ కార్యక్రమాలతో సూర్య 47 గ్రాండ్ ఓపెనింగ్..
వివాదాలు ఒకవైపు నడుస్తున్నా, రానా తన సినీ ప్రయాణాన్ని ఏమాత్రం తగ్గించడం లేదు. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో ఆయన నిర్మించిన ‘కాంత’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, అందులో ఆయన పోషించిన పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఒక పక్క సినిమాలు నిర్మిస్తూనే, మరోపక్క భారీ ప్రాజెక్టులతో నటుడిగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రానా ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ‘పరాశక్తి’. సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో రానా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా వివాదాలను ఎదుర్కొంటూనే, నిర్మాతగా మరియు నటుడిగా రానా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.