Ramcharan : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”..స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి మరో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో నవీన్ చంద్ర,సునీల్ ,శ్రీకాంత్ ,ఎస్.జె.సూర్య కీలక పాత్రలలో నటిస్తున్నారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు
Read Also :SSMB29 : మహేష్, రాజమౌళి మూవీ గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్..
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.దర్శకుడు శంకర్ మొన్నటి వరకు ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండటం వలన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రస్తుతం దర్శకుడు శంకర్ ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసే పనిలో వున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో రాంచరణ్ తండ్రి కొడుకుగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరిగింది.తాజాగా రాంచరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ కోసం విశాఖ చేరుకున్నారు.స్పెషల్ ఫ్లైట్ లో విశాఖ చేరుకున్న రాంచరణ్ కు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆయన బస చేస్తున్న హోటల్ వరకు ర్యాలీగా వెళ్లారు.