రంభ పేరు అందరికీ గుర్తే ఉంటుంది.. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా బాగా పాపులర్ అయ్యింది.. పదేళ్ల క్రితం సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ, బెంగాలీ, భోజ్ పురి భాషలలో రంభ నటించారు.. అన్ని ఇండస్ట్రీలలో కూడా సక్సెస్ ను అందుకున్నారు.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటున్నారు..
ఈ మధ్య రంభ తన కూతురితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆమె కూతురి ఫోటో వైరల్ అవుతోంది.. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ తల్లిని మించి అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.. రంభ మొదట మలయాళం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షలో ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో రాజేంద్రప్రసాద్‌కి జోడీగా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిట్ కావడంతో రంభకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఏవండీ ఆవిడ వచ్చింది, తొలి ముద్దు, భైరవ ద్వీపం, ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, బొంబాయి ప్రియుడు, హిట్లర్, బావగారు బాగున్నారా వంటి హిట్ సినిమాల్లో నటించింది..
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా రంభ తన పెద్ద కూతురితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మై ఏంజల్’ అంటూ రంభ షేర్ చేసిన ఫోటో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. చాలా అందంగా ఉంది అంటూ పొగిడేస్తున్నారు..