సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పాట ఒక అద్భుతం అనే చెప్పాలి.. ఎన్నో వందల పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.. స్టార్ హీరోల ప్రతి సినిమాలో ఈయన రాసిన పాట ఉంటుంది.. తాజాగా మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారంలోని దమ్ మసాలా బిర్యానీ సాంగ్ కు మాసివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ‘ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ పాటను రిలీజ్ చేశారు. మహేష్ బాబు, శ్రీలీల పై ఈ సాంగ్ డిజైన్ చేశారు.
తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. ఈ సాంగ్‌కు సాలిడ్ రెస్పాన్స్ వస్తుందని అనుకున్న మేకర్స్‌కు బిగ్ షాక్ తగిలంది.. ఈ పాటలో పదాలు అంతగా బాగోలేవని, ప్రిన్స్ ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేశారు.. సోషల్ మీడియాలో రిలీజ్ అవగానే దారుణంగా నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ పాట అసలు బాగోలేదని తమన్ ను ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.. అలాగే రామజోగయ్య శాస్త్రిని కూడా దారుణంగా ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే..
తాజాగా ఈ ట్రోల్స్ పై లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి స్పందించారు.. ఆయన సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు..” ప్రతి వాడు మాట్లాడేవాడే రాయి విసిరేవాడే.. అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుంది..పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని..మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా..అదే లేకపోతే..ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం ..తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి.. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ప్రతివాడు మాట్లాడేవాడే
రాయి విసిరే వాడే
అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుందిపాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని
మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా..అదే
లేకపోతే..ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం ..తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి— RamajogaiahSastry (@ramjowrites) December 14, 2023