Kartik Aryan Talks About His Remuneration: కొన్ని హిట్లు పడటంతో పాటు సినీ పరిశ్రమలో తమ క్రేజ్ పెరిగితే.. హీరోలు తమ పారితోషికాన్ని పెంచుతుంటారు. అందుకు బాలీవుడ్ యువనటుడు కార్తిక్ ఆర్యన్ కూడా కూడా మినహాయింపు కాదు. ఈమధ్య విభిన్నమైన కథాచిత్రాలతో దూసుకుపోతున్న కార్తిక్.. బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించాడు. తన మొదటి సినిమాకి గాను కేవలం రూ. 1.75 లక్షల పారితోషికం అందుకున్న ఈ యువ నటుడు.. ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. ఇతని డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే.. రోజుకు రూ. 2 కోట్లు ఛార్జ్ చేసే స్థాయికి ఎదిగాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఈ విషయాన్ని స్వయంగా తానే వెల్లడించాడు.
Avatar2: చరిత్ర సృష్టించిన అవతార్-2.. అగ్రస్థానం కైవసం
ఓ సినిమాకి గాను కార్తిక్ ఆర్యన్ రూ. 20 కోట్లు పారితోషికం తీసుకున్నాడనే వార్త వైరల్ అవ్వడంతో.. అది నిజమేనంటూ కార్తిక్ ఆర్యన్ క్లారిటీ ఇచ్చాడు. అతను మాట్లాడుతూ.. ‘‘కరోనా లాక్‌డౌన్ సమయంలో నేను ఒక సినిమాలో నటించాను. ఆ చిత్రానికి గాను రూ. 20 కోట్ల పారితోషికం తీసుకున్న మాట వాస్తవమే! అయితే.. ఆ చిత్రాన్ని నేను 10 రోజుల్లోనే పూర్తి చేశాను. ఆ సినిమా వల్ల నిర్మాతలకు ఎంతో లాభం వచ్చింది. కాబట్టి.. నేను ఆ స్థాయిలో పారితోషికం తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. గతేడాది నేను చేసిన హారర్ కామెడీ చిత్రం ‘భూల్ భులయ్యా-2’ సైతం మంచి విజయం సాధించింది. నేను వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను అలరించడానికి చాలా కష్టపడుతున్నాను. నా కష్టాన్ని చూస్తున్నారు కాబట్టే.. సినీ ప్రియులు నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల ప్రేమే నాకు ముఖ్యం’’ అంటూ చెప్పుకొచ్చాడు.
Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. కారణం అదే!
కాగా.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కార్తిక్ ఆర్యన్, లేటెస్ట్‌గా ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ ‘షెహజాదా’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఫిబ్రవరి 10వ తేదీన బాలీవుడ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇందులో కార్తిక్ ఆర్యన్ సరసన కృతి సనన్ కథానాయికగా నటించింది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్‌కి అక్కడ మంచి స్పందన వచ్చింది. మరి, తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయం సాధించినట్లుగానే ఈ రీమేక్ హిందీలోనూ హిట్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.
Shoaib Akhtar: బయోపిక్ నుంచి తప్పుకుంటున్నా.. తీస్తే కఠిన చర్యలు తప్పవు