రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో “ఆంధ్ర కింగ్ తాలూకా” అనే ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో, అతని ఫ్యాన్ జీవితాల నేపథ్యంలో రాసుకున్న ఈ సినిమాలో రామ్ అభిమానిగా కనిపిస్తుండగా, సూపర్ స్టార్‌గా ఉపేంద్ర కనిపిస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.
Also Read : Triptii Dimri: ఎన్టీఆర్ పై కన్నేసిన ‘స్పిరిట్’ బ్యూటీ !
“మిస్టర్ బచ్చన్” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన “కింగ్‌డమ్” సినిమాతో పాటు, ఇటీవల దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన “కాంత” సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించింది. ఆ మూడు సినిమాలు క్రేజ్ పరంగా బాగానే ఉన్నా, రిజల్ట్ మాత్రం ఆమెకు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు రామ్‌తో ఆమె నటిస్తున్న సినిమా మీదే ఆమె ఆశలన్నీ ఉన్నాయి.
ఇదిలా ఉండగా, రామ్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తోందని పుకార్లు చాలా రోజుల నుంచి తెరమీదకు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె ఈ విషయం మీద స్పందించింది. తాను రామ్‌కి మంచి స్నేహితురాలని అని చెప్పుకొచ్చింది. అలాగే నటన విషయంలో రామ్ తనకు ఎప్పుడూ ఆదర్శంగానే ఉంటాడంటూ ఆమె కామెంట్ చేసింది. అలాగే సినిమా చూసిన తర్వాత తమ జంటను చాలామంది అభిమానిస్తారని, సినిమా అంత బాగా వచ్చిందంటూ ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రేమ గురించి వస్తున్న పుకార్లను దాదాపు ఖండించినట్లే చెప్పుకోవాలి.
అయితే తాజాగా విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యూజికల్ కన్సర్ట్ లో మాత్రం ఆమె రామ్ గురించి మాట్లాడిన మాటలు చాలా ప్రేమపూర్వకంగా ఉన్నాయని, వారిద్దరి మధ్య ఏదో ఉందని అనుమానం కలిగించేలా ఉన్నాయని ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఆమె ఈ మాటలతో దానికి కాస్త బ్రేకులు పడినట్లే చెప్పొచ్చు.