Rajinikanth Fans: రజనీకాంత్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే.. లేదంటే విజయ్‌కి ఓట్లు పడకుండా చేస్తాం!
- రజనీకాంత్‌పై టీవీకే పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు
- ఆగ్రహం వ్యక్తం చేసిన సూపర్ స్టార్ ఫాన్స్
- మాజీ సీఎం పళనిసామి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సూపర్ స్టార్’ రజనీకాంత్‌పై తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ, సామాజిక వివాదానికి దారి తీసాయి. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ రజనీకాంత్‌ను గౌరవిస్తారని, ఆయన రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. టీవీకే పార్టీ రజనీకాంత్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. రజినీకాంత్ వ్యక్తిత్వం గురించి బహిరంగంగా తప్పుగా మాట్లాడుతారా?అంటూ పళనిసామి ఫైర్ అయ్యారు.
టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున వారం రోజుల క్రితం రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకేకు భయపడి రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదని చేసిన ఆరోపణలు సూపర్ స్టార్ అభిమానులను తీవ్రంగా కలిచివేశాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ పరిణామాలపై రజనీకాంత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీవీకే పార్టీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకుడు విజయ్ స్పందించి బహిరంగ క్షమాపణలు చెప్పాలని అభిమాన సంఘాలు కోరుతున్నాయి. లేదంటే రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో టీవీకే పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయాలా లేదా ఆ పార్టీకి ఓట్లు వేయకుండా నిరసన వ్యక్తం చేయాలా అన్న విషయంపై చర్చిస్తున్నట్లు అభిమాన సంఘాలు ప్రకటించాయి.
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
Also Read: Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్’.. షాకైన కస్టమర్లు!
మదురై, కోయంబత్తూర్ వంటి ప్రాంతాల్లో టీవీకే పార్టీకి వ్యతిరేకంగా రజనీకాంత్ అభిమానులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ వివాదం తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీవీకే పార్టీ విజయ్‌కి తలనొప్పిగా ఆధవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు తలనొప్పిగా మారాయి. ఎన్నికల సమయంలో డీఎంకేను ఇరుకున పెట్టడానికి రజనీకాంత్‌ను తక్కువ చేసి మాట్లాడడంపై సొంత పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్‌కు మద్దతుగా ఎన్డీఏ నేతలు కూడా నిలిచారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!