పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజా సాబ్‘. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్, స్టైలింగ్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. తాజాగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్‌ను థమన్ రివీల్ చేశారు.
‘నాచో నాచో’ అంటూ సాగే ఈ సెకండ్ సింగిల్‌ను జనవరి 5న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మొదటి పాటలో ప్రభాస్ స్టెప్పులు చూసి ‘వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్’ అని మురిసిపోయిన ఫ్యాన్స్ కి, ఈ రెండో పాట అంతకు మించి పూనకాలు తెప్పించేలా ఉంటుందని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ మరోసారి తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.
#NacheNache on 5 th ❤️🙌🏿
Prabhas anna costumes and styling 📈🙌🏿🙌🏿🙌🏿🙌🏿
— thaman S (@MusicThaman) January 3, 2026