టీమిండియాపై పాకిస్థాన్ గెలుపు రాజస్థాన్‌లోని ఓ టీచర్ మెడకు చుట్టుకుంది. ఎందుకంటే చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ ముగిసిన అనంతరం రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ప్రైవేట్ స్కూలులో పనిచేసే మహిళా టీచర్ నసీఫా అట్టారీ ‘మేం గెలిచాం’ అంటూ వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకుంది. ఈ స్టేటస్ చూసిన పలువురు భారత జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహాలకు లోనయ్యారు. దీంతో కొందరు ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా వాళ్లు చర్యలు తీసుకున్నారు.
Read Also: ప్రేమ మత్తు.. యువతి ఇంటిని తగలబెట్టిన యువకుడు
నసీఫా అట్టారీ విజయోత్సవ సంబరాల విషయం తమ దృష్టికి రాగానే స్కూల్ యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. అంతేకాకుండా ఆమెపై అంబామాతా పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 153 కింద కేసు నమోదైంది. అనంతరం సదరు టీచర్ క్షమాపణలు చెప్తూ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని, స్నేహితులతో సంభాషణ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మద్దతు ఇస్తానని చెప్పినందుకే అలా పోస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. అంతే తప్ప తాను పాకిస్థాన్ దేశానికి మద్దతు ఇవ్వలేదని, తాను భారతీయురాలినేని తెలిపారు. తనకు భారతదేశం అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.