అర్హతలేకున్నా పించన్లు తీసుకున్న వారి నుంచి అప్పటి వరకు తీకున్న పెన్షన్ మొత్తం రికవరీ చేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, ఏపీలో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.. ప్రతీ 10 వేల మందిలో ఏకంగా దాదాపు ఐదు వందల మంది అనర్హులే పెన్షన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు..
రాజస్థాన్‌లో నకిలీ పెన్షనర్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో 4 లక్షల మంది పెన్షన్లు నిలిపివేసింది. సామాజిక న్యాయం, సాధికారత శాఖ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.