డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది నేనింతే. ఫిల్మ్ ఇండస్ట్రీపైన తెరకెక్కించిన ఈ సినిమా క్లైమాక్స్ లో “సపోజ్ సినిమా పోయింది ఇంకో సినిమా చేయకుండా ఉంటామా? సినిమా హిట్ అయ్యింది ఇంకో సినిమా చేయకుండా ఉంటామా… మనకి తెలిసింది ఒకటేరా సినిమా సినిమా సినిమా” అనే డైలాగ్ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసే వాళ్లకి, ఇండస్ట్రీలో రావాలి అనుకునే వాళ్లకి ఈ డైలాగ్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఇప్పుడు ఈ మాటని నిజం చేసి చూపిస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. సంక్రాంతికి ఒకటి కాదు రెండు కాదు అయిదు సినిమాలు బరిలో ఉండడంతో గత కొన్ని నెలలుగా థియేటర్స్ ఇష్యూ జరుగుతోంది. ఎప్పుడూ లేనంత హీట్ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో కనిపిస్తోంది. ఏ సినిమాకు ఎన్ని థియేటర్స్ ఇస్తారు, ఏ సినిమాకి ఎక్కువ లాభం జరుగుతుంది అంటూ చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో గుంటూరు కారం సినిమా తర్వాత అంతటి పబ్లిక్ ఇంట్రెస్ట్ ని మైంటైన్ చేస్తున్న ఈగల్ సినిమా వాయిదా పడింది.
బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం.💥
మొండోడి మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుండి Februaryకి తీసుకొచ్చాడు.❤️🔥
మారింది తేది మాత్రమే మాసోడి mark కాదు. 😎
Now, EAGLE 🦅 takes flight for a global release in Telugu & Hindi on FEB 9th, 2024! 💥🔥… pic.twitter.com/VD20y8aAL2
— People Media Factory (@peoplemediafcy) January 5, 2024
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈగల్ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ… ఈగల్ ఫిబ్రవరి 9న వస్తుంది అని అనౌన్స్ చేసింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం. మొండోడి మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుండి Februaryకి తీసుకొచ్చాడు. మారింది తేది మాత్రమే మాసోడి mark కాదు” అంటూ ట్వీట్ చేసారు. రవితేజ సినిమాలు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈగల్ సినిమాని వాయిదా వేసాడు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రవితేజకి మాత్రమే చెల్లింది. ఆ ప్లేస్ లో వేరే ఏ హీరో ఉన్నా కూడా ఈగల్ సినిమా వెనక్కి వెళ్లేది కాదు.