PAN Card: మీ పాన్ కార్డు ఎవరు వాడుతున్నారో తెలుసుకోండి.. రాజస్తాన్‌లో ఇలాగే జరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAN Card: ఆధునిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరు మీ పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి. లేకపోతే మీకు సంబంధం లేకుండానే మీరు చిక్కుల్లో పడతారు. అలాంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తన పాన్ కార్డును వేరే వాళ్లు వాడడం మూలంగా ఐటీ శాఖ ఓ వ్యక్తిని బాధ్యుడిని చేసి నోటీసులు పంపించింది.
వివరాల్లోకి వెళ్లితే.. రాజస్థాన్‌లోని భిల్వారా ప్రాంతంలో 12.23 కోట్ల లావాదేవీకి సంబంధించి వికలాంగ స్టేషనరీ దుకాణదారుడికి ఆదాయపు పన్ను నోటీసు జారీ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ దుకాణదారుడు అంత మొత్తంలో లావాదేవీలేమీ చేయలేదు. అయితే ఆదాయపు పన్ను శాఖ నోటీసు ఎందుకు పంపింది? దీని వెనుక కారణం ఏమిటో అతనికి తెలియలేదు. కిషన్ గోపాల్ చాపర్వాల్ నోటీసును మళ్లీ మళ్లీ చదివినప్పుడు, తన పేరు మీద నోటీసు జారీ చేసినట్లు వచ్చినది నిజమేనని గ్రహించాడు. అనంతరం ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.. అప్పుడు ఎవరో తన పాన్ కార్డును దుర్వినియోగం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Read Also: Covid 19: కరోనా కేసుల పెరుగుదలకు కారణం అవుతున్న XBB1.16 వేరియంట్.. లక్షణాలివే..
ఓ మీడియా సమాచారం ప్రకారం.. రాజస్థాన్‌లోని భిల్వారాలోని సంజయ్‌నగర్‌లో నివసిస్తున్న 38 ఏళ్ల కిషన్ గోపాల్ చపర్వాల్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చార్టర్డ్ అకౌంటెంట్ వద్దకు వెళ్లగా.. పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందని.. ముంబై, సూరత్‌లోని రెండు డైమండ్ కంపెనీలు దుర్వినియోగం చేశాయని చెప్పాడు. ఈ కంపెనీల ద్వారా కోట్ల రూపాయల మార్పిడి జరిగింది.
కిషన్ చాపర్వాల్ షాపు ప్రారంభించడానికి అప్పు తీసుకున్నాడు. కానీ ఇప్పటికీ రుణం చెల్లించడంలో సమస్య ఏర్పడింది. తనకు దుకాణంలో వచ్చే సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోతున్నాయి. చేతిలో ఏమీ మిగలడం లేదు. కాబట్టి ఇన్ని కోట్లతో తనకు ఏ సంబంధం లేదని… నకిలీ కంపెనీలు పెట్టి పాన్ కార్డు ద్వారా మోసపోయానని వాపోయాడు.
Read Also: Sreeleela: ఈ కన్నడ బ్యూటీ క్రేజ్ ని తెగ వాడేస్తున్నారుగా…
ఈ లావాదేవీకి సంబంధించి సమాధానం చెప్పాలంటూ కిషన్ గోపాల్‌కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. అలాగే, 12.23 కోట్ల లావాదేవీల విషయంలో వివరాలను సమర్పించాలని కోరింది. పాన్ కార్డును ఎవరు వాడుతున్నారో తనకు తెలియదన్నారు. అలాగే, ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలని కిషన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై సుభాష్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!