Prabhas: విదేశాలకు ప్రభాస్.. ఆ హీరోయిన్లలో ఎవరితో రొమాన్స్?
- ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా రాజాసాబ్
- హార్రర్ కామేడీ ఎంటర్టైనర్గా రాజాసాబ్
- ఆ హీరోయిన్‌తో ప్రభాస్ రొమాన్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హార్రర్ కామేడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, ప్రభాస్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. డార్లింగ్ వింటేజ్ లుక్, ముఖ్యంగా ఓల్డ్ గెటప్ మాత్రం అదిరిపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ప్రస్తుతం హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌తో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత రాజాసాబ్ కోసం విదేశాలకు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇంకా కొన్ని సాంగ్స్ షూటింగ్ పెండింగ్‌లో ఉన్నాయట. దీంతో వచ్చే నెలలో యూరప్‌లో ఒక సాంగ్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఈ ముగ్గురిలో విదేశాల్లో ప్రభాస్ ఎవరితో రొమాన్స్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
Also Read: Pushpa 2: అస్సలు తగ్గేదేలే.. భారీ రన్ టైం లాక్! ఆ మాత్రం ఉండాల్సిందే
ప్రభాస్, మాళవిక మోహనన్‌ల మధ్య పాట ఉంటుందని సమాచారం. అదిరిపోయే లొకేషన్స్‌లో ఈ సాంగ్ షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. సంక్రాంతికి ప్రమోషన్స్ స్టార్ చేసి.. సమ్మర్ వరకు మస్త్ కిక్ ఇవ్వనున్నాడు రాజాసాబ్. ప్రభాస్‌ను మారుతి ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో చూడాలి. ఇక రాజాసాబ్ చిత్రంను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ రెండు భిన్న కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!