MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MA Ghaffoor’s Son Kiran Dies in US: సీపీఎం సీనియర్ నేత, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎంఏ గఫూర్, ఐద్వా నేత నిర్మల కుమారుడు కిరణ్(41) అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో నివసిస్తున్న కిరణ్ అక్టోబర్ 1న మరణించినట్లు తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలిసింది. గత పది రోజులుగా కుమారుడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులను సంప్రదించారు.
ఉన్నత విద్య అభ్యసించి.. అమెరికాలో ఉద్యోగం
కిరణ్ విద్యాపరంగా మంచి ప్రతిభ కనబరిచారు. చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ మద్రాస్)లో ఎం.టెక్ పూర్తి చేశారు. అనంతరం న్యూయార్క్ యూనివర్సిటీలో డేటా సైన్స్ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ప్రముఖ సంస్థ పేపాల్‌లో సీనియర్ డేటా సైంటిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో నివాసం ఉంటున్న కిరణ్ మృతి వార్త కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది.
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
పది రోజులుగా సమాచారం లేకపోవడంతో ఆందోళన
గత పది రోజులుగా కిరణ్ నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఆయన గఫూర్, నిర్మల దంపతులు ఆందోళనకు గురయ్యారు. దీంతో అమెరికాలోని అమనా (AMANA), తానా (TANA) ప్రతినిధులను సంప్రదించారు. వారు వెంటనే స్పందించి వివరాలు సేకరించడంతో అక్టోబర్ 1వ తేదీనే కిరణ్ మరణించినట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు తల్లిదండ్రులకు తెలియజేశారు.
కిరణ్ భౌతికకాయాన్ని కర్నూలుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
కిరణ్ భౌతికకాయాన్ని అమెరికా నుంచి కర్నూలుకు తీసుకురావడానికి అమనా, తానా ప్రతినిధులు సహకరిస్తున్నారు. అయితే, అమెరికాలో వరుసగా మూడు రోజుల సెలవులు ఉండటంతో అవసరమైన ప్రక్రియలకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కిరణ్ భౌతికకాయం కర్నూలుకు చేరుకోవడానికి సుమారు వారం రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. చిన్న వయసులోనే ఉన్నత విద్యను అభ్యసించి, విదేశాల్లో సీనియర్ డేటా సైంటిస్టుగా పనిచేస్తున్న కిరణ్ మరణవార్త అతని కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది.
తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!