IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Coaching Staff Changes: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జట్టు ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను నియమించిన సీఎస్కే యాజమాన్యం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీతో సీఎస్కే విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చెన్నై జట్టు సహాయక సిబ్బందిలో మార్పుల వ్యవహారం క్రికెట్ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. మైఖేల్ హస్సీని తమ నిర్ణయం గురించి సీఎస్కే యాజమాన్యం అధికారికంగా సమాచారం అందించింది. ఐపీఎల్ 2027లో హస్సీ మరో ఫ్రాంచైజీ తరఫున కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జట్లతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై హస్సీ నుంచి గానీ, సంబంధిత ఫ్రాంచైజీల నుంచి గానీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సీఎస్కేలో ఇప్పటికే కోచింగ్ విభాగానికి సంబంధించి పలు మార్పులు చోటుచేసుకున్నాయి. 18 ఏళ్ల పాటు జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో ఆ ఫ్రాంచైజీ విడిపోయింది. బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ కూడా జట్టును వీడినట్లు సమాచారం. అలాగే ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ ఫోస్టర్ భవిష్యత్తు కూడా ప్రస్తుతం అనిశ్చితిలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
- West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ఇటీవలే జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా నియమించిన సీఎస్కే.. మాజీ పేసర్ మోహిత్ శర్మకు బౌలింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు మైఖేల్ హస్సీ కూడా జట్టును వీడటంతో కొత్త బ్యాటింగ్ కోచ్ ఎవరనే ఆసక్తి నెలకొంది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరున్న సీఎస్కే.. కొత్త కోచింగ్ బృందంతో వచ్చే సీజన్‌కు ఎలా సిద్ధమవుతుందో చూడాలి. హస్సీకి సీఎస్కేతో 15 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఆటగాడిగా, కోచ్‌గా జట్టు విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆటగాడిగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన హస్సీ.. కోచ్‌గా మరో మూడు టైటిళ్ల విజయాల్లో భాగమయ్యారు. ముఖ్యంగా బ్యాటర్‌గా సీఎస్కే ప్రారంభ సంవత్సరాల్లో జట్టు విజయాలకు తన వంతు సహకారం అందించారు. 2013 ఐపీఎల్ సీజన్లో 733 పరుగులు సాధించి అద్భుతంగా రాణించారు.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!