Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman Ansh: సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలోకి వచ్చిన మూడో నెల నాటికి కలెక్షన్లు తగ్గిపోవడం చూస్తుంటాం. కానీ, ‘హనుమాన్ అంశ్’ సినిమా మాత్రం 9వ వారంలోనూ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూ, విశేష ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద తన దిగ్విజయ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ భక్తిరస చిత్రం 64వ రోజున ఏకంగా 60 శాతం మేర వసూళ్లను పెంచుకోవడం విశేషం. అప్పటివరకు హిందీలో మాత్రమే నడుస్తున్న ఈ చిత్రానికి అదనంగా, అక్టోబర్ 9న తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలోకి రావడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం.
రిలీజైన 64వ రోజున ఈ సినిమా రెండు భాషల్లో కలిపి భారతదేశంలో రూ. 1.20 కోట్ల నికర వసూళ్లను సాధించింది. దీనికి ముందు రోజు సాధించిన రూ. 75 లక్షలతో పోలిస్తే ఇది ఏకంగా 60 శాతం ఎక్కువ. ఈ రోజు వసూళ్లలో హిందీ వెర్షన్ నుంచి రూ. 60 లక్షలు రాగా, మొదటి రోజు విడుదలైన తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సరిగ్గా రూ. 60 లక్షల వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటివరకు భారతదేశంలో ఈ సినిమా సాధించిన మొత్తం నెట్ కలెక్షన్ రూ. 329.18 కోట్లకు చేరుకోగా, ఇండియా గ్రాస్ వసూళ్లు రూ. 388.77 కోట్లకు చేరాయి. ఇక విదేశాల్లో రూ. 40.05 కోట్ల గ్రాస్ సాధించడంతో, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం గ్రాస్ వసూళ్లు 64 రోజుల నాటికి రూ. 428.82 కోట్ల మైలురాయిని చేరుకున్నాయి.
Also Read
- WPL 2027 Auction: వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌కు అత్యధిక ధర.. సోఫీ మోలినెక్స్ను సొంతం చేసుకున్న యూపీ వారియర్స్..
- Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
- Cyclone Arnab Alert: నేడు ఏపీలో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
- Sai Pallavi: "రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు".. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
బాక్సాఫీస్ లెక్కలు చూస్తే.. 9వ వారంలో ‘హనుమాన్ అంశ్’ చిత్రం రూ. 10.60 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇతర పెద్ద చిత్రాలైన ధురంధర్ 2 (రూ. 2.19 కోట్లు), ధురంధర్ (రూ. 1.75 కోట్లు), ఛావా (రూ. 1.25 కోట్లు), స్త్రీ 2 (రూ. 88 లక్షలు) సినిమాలు వాటి 9వ వారంలో సాధించిన కలెక్షన్లన్నింటినీ కలిపినా, ఈ ఒక్క చిత్రం సాధించిన వసూళ్లే చాలా ఎక్కువ కావడం విశేషం. అంతేకాకుండా అక్టోబర్ 8 నాటికి బుక్‌మైషోలో ఈ సినిమా 80 లక్షలకు పైగా టికెట్ల విక్రయాలను సాధించింది. ఒక్క 9వ వారంలోనే బుక్‌మైషో ద్వారా దాదాపు 2.61 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక పివిఆర్, ఐనాక్స్, సినీపొలిస్ వంటి మల్టీప్లెక్స్ నెట్‌వర్క్‌లలో ఈ వారంలో 2.58 లక్షల మంది ప్రేక్షకులు సినిమాను చూడగా, రూ. 6.60 కోట్ల గ్రాస్ వసూలైంది.
ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఆగస్టు 7, 2026న థియేటర్లలో విడుదలైన తొలిరోజు కేవలం రూ. 10 లక్షల కలెక్షన్ మాత్రమే సాధించింది. మొదటి వారంలో రూ. 1.08 కోట్లు, రెండో వారంలో రూ. 40 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా, మూడో వారం నుంచి ఊపందుకుని రూ. 10.40 కోట్లు సాధించింది. ఆ తర్వాత నాలుగో వారంలో రూ. 61 కోట్లు, ఐదో వారంలో అత్యధికంగా రూ. 90.25 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత ఆరో వారంలో రూ. 80.25 కోట్లు, ఏడో వారంలో రూ. 44.80 కోట్లు, ఎనిమిదో వారంలో రూ. 29.20 కోట్లు, తొమ్మిదో వారంలో రూ. 10.60 కోట్లు సాధించి బాక్సాఫీస్ వద్ద తన జోరును ప్రదర్శించింది.
తాజావార్తలు
-
Amazon Layoffs 2026: అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. పొద్దు పొద్దున్నే 250 మంది ఉద్యోగులకు షాక్!
-
WPL 2027 Auction: వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌కు అత్యధిక ధర.. సోఫీ మోలినెక్స్ను సొంతం చేసుకున్న యూపీ వారియర్స్..
-
Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
-
Cyclone Arnab Alert: నేడు ఏపీలో భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
ట్రెండింగ్
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!