Rain Alert: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు!
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- తెలుగు రాష్ట్రాల్లో వానలు
- తమిళనాడులో భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా కొన్నిచోట్ల పడ్డాయి. శనివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహా సముద్రం మీదుగా ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈ అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రోజు ముగిసేనాటికి అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కొనసాగుతూ.. డిసెంబర్ 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతం సమీపానికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 11, 12 తేదీల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు మరియు కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయని చెప్పారు.
Also Read
అల్పపీడనం ప్రభావంతో ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈరోజు వేకువ జామున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జిల్లాలో వర్షం పడుతోంది. అకాల వార్షాల కారణంగా చేతికందిన వరి, మిర్చి పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..