ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా కొన్నిచోట్ల పడ్డాయి. శనివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహా సముద్రం మీదుగా ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈ అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రోజు ముగిసేనాటికి అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా…