సినిమా ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ కి ఒకరు కారణం కాకపోయినా, ఒక్కరినే వేలెత్తి చూపించాల్సిన అవసరం లేకపోయినా వరసగా ఫ్లాప్స్ వస్తుంటే మాత్రం ఒకరినే అనడం అందరికీ అలవాటైన పని. అలా ప్రస్తుతం ఫ్లాప్ స్ట్రీక్ తో అందరి దృష్టిలో పడింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. దువ్వాడ జగన్నాధం నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వరకూ పూజా హెగ్డే ఏ సినిమాలో నటిస్తే అది హిట్ అయ్యింది. కేవలం రెండేళ్ల గ్యాప్ లోనే అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్(రంగస్థలం సినిమాలో ఐటెమ్ సాంగ్)లతో నటించిన పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ అయిపొయింది. హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఫేస్ చేసిన అఖిల్ కి కూడా హిట్ ఇచ్చిన పూజా హెగ్డే, అక్కడి నుంచి ఫ్లాప్ స్ట్రీక్ లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా 2022 పూజా హెగ్డే కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్యాడ్ ఫేజ్ అని చెప్పాలి.
Read Also: Akhil: మోస్ట్ వాంటెడ్ ‘వైల్డ్ సాలా’ అంటార్రా బాబు…
2022లో పూజా హెగ్డే పాన్ ఇండియా సినిమాలు చేసింది. ప్రభాస్ తో ‘రాధే శ్యాం’, దళపతి విజయ్ తో ‘బీస్ట్’, చిరు-చరణ్ లతో ‘ఆచార్య’, రణవీర్ సింగ్ తో ‘సర్కస్’ లాంటి భారి బడ్జట్ సినిమాల్లో పూజా హెగ్డే నటించింది కానీ ఇందులో ఒక్క సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది. కొట్లలో నష్టాలు మిగిలించిన ఈ సినిమాలు పూజాకి ఐరన్ లెగ్ ముద్రని తెచ్చాయి. ఆమె ఏ సినిమాలో నటించినా, అది ఫ్లాప్ అవుతుంది అనే విమర్శలు కూడా మొదలయ్యాయి. 2023లో అయినా పూజా హెగ్డే ఫేట్ మారుతుంది అనుకుంటే ఈద్ కి రిలీజ్ అయిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా ఫ్లాప్ అయ్యింది.
Read Also: Agent: ‘ఏజెంట్’ సెన్సార్ టాక్.. బుల్లెట్ల వర్షమే!
రంజాన్ సీజన్, సల్మాన్ ఖాన్ సినిమా అవ్వడం వలన కిసీ కా భాయ్ కిసీ జాన్ సినిమాకి ఒక మోస్తరు కలెక్షన్స్ అయినా వస్తున్నాయి కానీ లేదంటే డిజాస్టర్ అయ్యేది. అలా 2023లో కూడా ఫ్లాప్ స్ట్రీక్ ని కంటిన్యు చేస్తున్న పూజా హెగ్డే, హిట్ ట్రాక్ ఎక్కాలి అంటే అది కేవలం మాటల మాంత్రికుడి వల్లే అవుతుంది. తనని స్టార్ హీరోయిన్ ని చేసిన త్రివిక్రమ్ మాత్రమే ఇప్పుడు పూజా హెగ్డే కెరీర్ ని మళ్లీ గాడిలో పెట్టగలడు. మహేశ్ తో త్రివిక్రమ్ చేస్తున్న ‘SSMB 28’ హిట్ అయితే పూజా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చినట్లే, ఈ హిట్ ఇచ్చే బాధ్యత కూడా త్రివిక్రమ్ దే. మరి మాటల మాంత్రికుడు ఏ మాయ చేసి పూజా హెగ్డే కెరీర్ ని హిట్ ట్రాక్ ఎక్కిస్తాడో చూడాలి.