NTV Telugu Site icon

Parliament Sessions: రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు! రికార్డు నుంచి తొలగింపు

Rahul Gandhi

Rahul Gandhi

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన రెండో ప్రసంగం కూడా వివాదాస్పదమైంది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సోమవారం లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని పదాలను రికార్డు నుంచి తొలగించారు. తొలగించిన పదాలలో.. మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ పేర్లు ఉన్నాయి. రాహుల్ గాంధీ తన 45 నిమిషాల ప్రసంగంలో ఈ నలుగురి పేర్లను తీసుకున్నారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.

READ MORE: Telangana Assembly 2024: కేసీఆర్‌ రికార్డ్ బ్రేక్‌ చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి..

రాహుల్ గాంధీ ఏం చెప్పారు?
ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చేసిన రెండో ప్రసంగంలో ‘చక్రవ్యూహ’ ప్రధానాంశం. మహాభారత యుద్ధంలో చక్రవ్యూహం నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ.. అందులో భయం, హింస ఉందని, ఆరుగురు వ్యక్తులు అభిమన్యుని ట్రాప్ చేసి చంపారని రాహుల్ గాంధీ అన్నారు. చక్రవ్యూహాన్ని పద్మవ్యూహంగా అభివర్ణిస్తూ.. తలకిందులు చేసిన కమలం లాంటిదని అన్నారు.

READ MORE:Attack On Polavaram MLA Balaraju Car: జనసేన ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి.. పవన్‌ కల్యాణ్‌ సీరియస్..

కొత్త చక్రవ్యూహం సిద్ధమైందని.. అది కూడా కమలం ఆకారంలో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. దాన్ని ప్రధాని మోడీ దానిని ఛాతీపై పెట్టుకుని తిరుగుతున్నారన్నారు. అభిమన్యుని ద్రోణ, కర్ణ, కృపాచార్య, కృతవర్మ, అశ్వస్థమా, శకుని కలిసి చంపారని పేర్కొ్నారు. “నేటికీ చక్రవ్యూహం మధ్యలో ఆరు మంది ఉన్నారు. ఈ 6 మంది దానిని నియంత్రిస్తారు. ఇందులో నరేంద్ర మోడీ , అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ ఉన్నారు.” అని ఆయన వ్యాఖ్యానించారు.

READ MORE:Mr Bachchan: రవితేజ సినిమాలో యంగ్ హీరో గెస్ట్ రోల్..ఎవరంటే.?

రాహుల్ గాంధీ ఈ ప్రకటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అడ్డుతగిలారు. ఈ సభలో సభ్యుడు కాని వ్యక్తి పేరు తీసుకోరాదని గుర్తు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అజిత్ దోవల్, అదానీ, అంబానీ పేర్లను తీసుకోకూడదనుకుంటే వద్దని అన్నారు. మోడీ ప్రభుత్వంలో దేశ ప్రజలు చిక్కుల్లో పడ్డారని, ఇందులో రైతులు, యువత ఎక్కువగా నష్టపోతున్నారని ఆరోపించారు.

READ MORE:Kurnool Kidnap Case: కర్నూలులో నగల వ్యాపారి కిడ్నాప్.. సినీఫక్కీలో పోలీసుల ఛేజ్..

మొదటి ప్రసంగంలో కూడా పదాల తొలగింపు…
జులై 1న రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత హోదాలో పార్లమెంట్‌లో తొలి ప్రసంగం చేశారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తొలి ప్రసంగంలో రాజ్యాంగ ప్రతిని, శివుడి బొమ్మను చూపుతూ రాహుల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అతడి తొలి ప్రసంగంలో ఎక్కువ భాగం పార్లమెంటరీ రికార్డు నుంచి తొలగించబడింది. ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించిన తర్వాత రాహుల్ గాంధీ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ కూడా రాశారు.

Show comments