Bharat Jodo Nyay Yatra: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రెండో రోజు ఇండియా కూటమి బలప్రదర్శన నిర్వహించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ఈ రోజు ముంబైలో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. 63 రోజుల పాటు జరిగిన ఈ యాత్ర ముగింపు వేడుకలు ముంబైలోని శివాజీ పార్క్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి తేజస్వీ యాదవ్, ఎంకే స్టాలిన్, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, ప్రియాంక గాంధీ వాద్రా, ఉద్ధవ్ థాకరే, మెహబూబా ముఫ్తీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు.
Read Also: Indian IT CEOs: విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్.. టాప్-6 ఐటీ సీఈఓల జీతాలు ఎంతంటే..?
ఎన్నికల తేదీలు వచ్చాయి, మేమంతా రాహుల్ గాంధీ ఆహ్వానం మేరు ముంబై వచ్చామని తేజస్వీ యాదవ్ అన్నారు. రాజ్యాంగాన్ని మర్చేందుకు బీజేపీ 400కు పైగా లోక్ సభ స్థానాలను గెలుస్తామని మాట్లాడుతుందని, రాహుల్ గాంధీలో ‘గాంధీ’ పేరుకు బీజేపీ భయపడుతోందని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఇండియా కూటమి పోరాటం ప్రధాని మోడీ, అమిత్ షాలపై కాదని వారి ద్వేషభావజాలానికి వ్యతిరేకమని తేజస్వీ యాదవ్ అన్నారు. మహాత్మా గాంధీ ముంబై నుంచి ‘క్విట్ ఇండియా’ పిలుపునిచ్చారని, కాబట్టి ఇండియా కూటమి నాయకులు ముంబై నుంచి బీజేపీని అధికారం నుంచి గద్దె దించాలని శరత్ పవార్ పిలుపునిచ్చారు. ప్రజలంతా ఏకమైతే నియంతృత్వం అంతమవుతుందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ప్రజలు మీ ఓట్లను కాపాడుకోవాలి, ఎందుకంటే ఈవీఎం యంత్రం దొంగ, కూటమి అధికారంలోకి వస్తుంది, ఈ యంత్రం పని ముగుస్తుందని, ఎన్నికల సంఘం స్వతంత్రమవుతుందని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.