Rahul Gandhi: పరాభవం ఎదురైన చోటు నుంచే రాహుల్ పోటీ.. కాంగ్రెస్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్తగా నియమించబడిన అధ్యక్షుడు అజయ్ రాయ్ శుక్రవారం ధృవీకరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్‌లో పోటీ చేయగా.. అమేథీలో ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్ గాంధీ.. వయనాడ్‌లో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం దిశగా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ గాంధీని దాదాపు 55,000 ఓట్ల తేడాతో ఓడించారు.
Read Also: Chandrayaan-3: చంద్రయాన్ ప్రయాణంలో కీలక ఘట్టం.. ల్యాండింగ్‌కు అడుగు దూరంలో..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
అమేథీ లోక్‌సభ నియోజకవర్గం ఒకప్పుడు గాంధీ కుటుంబం జేబులో ఉండేది. రాహుల్ గాంధీ 2004 నుంచి అక్కడి నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఆయన తల్లి సోనియా గాంధీ రాహుల్ కోసం సీటును ఖాళీ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రియాంక గాంధీ వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేయాలని నిర్ణయించుకుంటే, ఆమె గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలోని ప్రతి కార్యకర్త కృషి చేస్తారని అజయ్ రాయ్ సూచించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా, ప్రధాని మోడీని సవాలు చేస్తూ ప్రియాంక గాంధీ వారణాసి నుండి పోటీ చేయవచ్చని ఊహించబడింది. అయితే కాంగ్రెస్ చివరి క్షణంలో అజయ్ రాయ్‌ను ఆ సీటు నుంచి పోటీకి దింపింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా అజయ్ రాయ్ వారణాసి నుంచి పోటీ చేసి నరేంద్ర మోదీ చేతిలో ఓడిపోయారు.
మోడీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువునష్టం కేసులో తన పదవిని కోల్పోయిన రాహుల్ గాంధీ.. ఇటీవల సుప్రీం తీర్పుతో మళ్లీ ఎంపీగా తన పదవిని దక్కించుకున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంలోనూ రాహుల్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. ఇదిలా ఉండగా.. మరో సారి భారత్ జోడో యాత్ర చేపట్టి దేశ ప్రజలను ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!