ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటు వర్షాకాల సమావేశంలో రెండవ రోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోమవారం కూడా లోక్ సభలో అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చించారు. తాజాగా ఈ అంశంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడారు. పహల్గాంలో టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ గాంధీ అన్నారు.
CM Revanth Reddy : ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావం ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొనాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మే 8 గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత భారీగా పాల్గొనాలని ఆయన కోరారు. ఇక బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన సివిల్ మాక్‌డ్రిల్…