Ganderbal Terror Attack: ఉగ్రవాదంపై పోరులో దేశం ఏకమైంది: రాహుల్ గాంధీ
- ఉగ్రవాదంపై పోరులో దేశం ఏకమైంది.
- జమ్మూకశ్మీర్‌లోని గందర్బల్లో ఉగ్రవాదులు పిరికిపంద చర్యపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganderbal Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని గందర్బల్లో ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మెస్‌లో భోజనం చేస్తున్న కార్మికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ డాక్టర్‌తో సహా ఏడుగురు చనిపోయారు. ఈ ఉగ్రదాడిపై తాజాగా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని గందర్బల్లో జరిగిన ఉగ్రదాడిలో వైద్యుడు, వలస కూలీలు సహా పలువురిని చంపడం చాలా పిరికి పని అని, క్షమించరాని నేరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Read Also: Naga Chaitanya Shobita Weeding: మొదలైన నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు..
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ఉగ్రవాదుల ఈ దుస్సాహసం జమ్మూకశ్మీర్‌లో జీవన విధానాన్ని, ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయదని రాహుల్ గాంధీ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో దేశం మొత్తం ఏకమై ఉందని ఉద్ఘాటించారు.
Read Also: Malla Reddy Mass Dance: పెళ్లి సంగీత్ లో మల్లన్న మాస్ స్టెప్పులు..
जम्मू-कश्मीर के गांदरबल में आतंकी हमले में एक डॉक्टर और प्रवासी मज़दूरों समेत कई लोगों की हत्या बहुत ही कायरतापूर्ण और अक्षम्य अपराध है।
सभी शोकाकुल परिवारों के प्रति अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के शीघ्र स्वस्थ होने की आशा करता हूं।
आतंकियों का यह दुस्साहस…
— Rahul Gandhi (@RahulGandhi) October 21, 2024
ఇక ఈ విషయంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా తాజాగా ఈ దాడిని ఖండించారు. గందర్బల్ జిల్లాలోని గుండ్ ప్రాంతంలో సొరంగం నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ కంపెనీ కార్మికుల శిబిరాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని గడ్కరీ తెలిపారు. ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు కార్మికులు, ఒక వైద్యుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌లో, జమ్మూకశ్మీర్‌లోని సోనామార్గ్‌లోని గగాంగీర్‌లో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో నిమగ్నమై ఉన్న అమాయక కార్మికులపై జరిగిన ఉగ్రదాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని గడ్కరీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో అమరులైన కార్మికులకు నా వినయపూర్వకమైన నివాళులర్పిస్తున్నాను. ఇంకా వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని పార్థిస్తున్నట్లు ఆయన రాసుకొచ్చారు.
I strongly condemn the horrific terror attack on innocent laborers in Gagangir, Sonamarg, Jammu & Kashmir, who were engaged in a vital infrastructure project.
I offer my humble tribute to the martyred laborers and extend my deepest condolences to their families during this…
— Nitin Gadkari (@nitin_gadkari) October 20, 2024
తాజావార్తలు
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!