Ganderbal Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్‌లో ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మెస్‌లో భోజనం చేస్తున్న కార్మికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ డాక్టర్‌తో సహా ఏడుగురు చనిపోయారు. ఈ ఉగ్రదాడిపై తాజాగా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్‌లో జరిగిన ఉగ్రదాడిలో వైద్యుడు, వలస కూలీలు సహా పలువురిని చంపడం చాలా పిరికి పని అని, క్షమించరాని నేరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు నా…